తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటు ననుంచి వచ్చినా.. వస్తే చాలు అనుకుంటూ.. డబ్బులు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌ను.. ఇతరత్రా నగదును కూడా వాడేసిన ప్రభుత్వం ఇప్పడు విద్యుత్ ఉద్యోగుల సొమ్ముపై పడింది!. అది కూడా తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో ఉద్యోగుల జీపీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ డబ్బులపై కన్నేసింది!. ప్రస్తుతం ఇది తీవ్ర వివాదంగా రగులుతుండడం గమనార్హం!.
వివరాల్లోకి వెళితే 1999 నుంచి 2004 వరకు రెండు సంస్థల ఉద్యోగులు పైన పేర్కొన్న ప్రయోజనాల రూపంలో రూ.2900 కోట్లు ఆదా చేశారు. బకాయి మొత్తం ఏపీ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వద్ద ఉంది. ఈ నిధులను టేకోవర్ చేయాలని ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక సంస్థను కోరింది.
ఏపీ ప్రభుత్వం చేస్తున్న విషయం గురించి తెలుసుకున్న తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు!. ఈ విషయాన్ని పరిశీలించాలని తెలంగాణ విద్యుత్ శాఖ సీఎండీ ప్రభాకర్‌రావుకు ఉద్యోగుల జేఏసీ లేఖ రాసింది. అలాగే ఏపీ జెన్‌కోకు కూడా లేఖలు పంపి, తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కోలకు తక్షణమే రూ.2900 కోట్లు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు!.
ఏపీ ప్రభుత్వం గానీ, జెన్‌కో గానీ ఈ లేఖను పట్టించుకోకుంటే తెలంగాణా సంస్థలతో అబద్ధాలు చెబుతున్న ఏపీ విద్యుత్ శాఖలోని పెన్షన్ హోల్డర్లకు అడ్డంకులు సృష్టిస్తామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ హెచ్చరించింది. ఇది సీరియస్‌గా మారితే తెలుగు రాష్ట్రాల మధ్య మరింత చిచ్చు రేపితే ఇది చాలా దారుణమైన సంఘటన కావచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు కావస్తున్నా ఇంకా చాలా సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, సంస్థలు పంచకుండా పడి ఉన్నాయని, ఏపీ విభజన చట్టంలోని 8, 9 షెడ్యూల్‌లోని రూ.1.42 లక్షల కోట్ల ఆస్తులను ఇంకా విభజించాల్సి ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వెల్లడించారు. కేంద్రప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి ఆస్తులు, అన్ని సంస్థలను విభజించి ఉంటే ఇలాంటివి వచ్చేవి కావని అంటున్నారు పరిశీలకులు.