తెలంగాణకు చెందిన మరో యువకుడు అమెరికాలో ప్రాణాలు కోల్పోయాడు. పైచదువులు, ఉన్నత ఉద్యోగం కోసం అక్కడికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తూ చనిపోయాడు.
తెలంగాణలోని కోదాడకు చెందిన సిరపురపు రవికుమార్ (26) అనే యువకుడు అమెరికాలోని సిగ్నా ఇన్సూరెన్స్ కంపెనీలో మూడేళ్లుగా పనిచేస్తున్నాడు. తాజాగా రవికుమార్ స్నేహితులతో కలిసి బోటింగ్ కు వెళ్లి ప్రమాదవశాత్తూ అక్కడి ఓ సరస్సు లో పడి మృతి చెందాడు.
భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11.30 గంటలకు అక్కడ అమెరికాలో ఉదయం విహారయాత్రకు రవికుమార్ వెళ్లాడు. పడవలో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తూ నీటిలో పడి చనిపోయాడు. అతడితోపాటు స్నేహితులు ఉన్నారు.
శనివారం ఉదయం అమెరికా పోలీసులు రవి తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపారు. విషయం తెలియగానే తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.
కోదాడలోని అజాద్ నగర్ లోని రవి ఇంటి వద్ద విషాదచాయలు అలుముకున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతీసుకొని మృతదేహాన్ని కోదాడకు రప్పించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.