నిన్నమొన్నటివరకూ ఫోన్ అంటే మాట్లాడుకోవటం.. లేదంటే మేసేజ్ లు పంపుకోవటం మాత్రమే. ఇప్పుడు మాటల కంటే చేతలకే పని ఎక్కువైంది. మొబైల్ ఫోన్ ను మాట్లాడుకోవటం కంటే కూడా.. మొయిల్స్ చెక్ చేసుకోవటం.. వాట్స్ ప్ చాటింగ్.. వీడియోలు.. వార్తలు చదువుకోవటం.. గేమ్స్ ఆడుకోవటం వంటి వాటి విషయంలోనే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే.
పెరిగిన డేటా వినియోగం టెలికం కంపెనీలకు కాసులు కురిపిస్తున్నాయి. మరోవైపు.. పెరుగుతున్న డేటా డిమాండ్ ను మరింత ఆదాయం పొందేలా కంపెనీలు వ్యూహాలు మొదలెట్టాయి. ఇప్పటికే ప్రముఖ టెలికం కంపెనీలైన ఎయిర్ టెల్.. ఐడియా నెట్ వర్క్ లు పోస్ట్ పెయిడ్ వినియోగదారులు వినియోగించే డేటా ఛార్జీల్ని పెంచేశాయి.
అదృష్టవశాత్తు.. ఈ పెంపు తెలుగు రాష్ట్రాల్లో లేదు. దేశంలోని వివిధ సర్కిల్స్ లో ఈ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ.. హర్యానా.. హిమాచల్ ప్రదేశ్.. మహారాష్ట్ర.. పంజాబ్.. రాజస్థాన్.. ఉత్తరప్రదేశ్ తూర్పు.. పశ్చిమ.. సర్కిళ్లలో ఛార్జీలు పెంచేస్తూ ఎయిర్ టెల్ నిర్ణయం తీసుకుంది.
మరో ప్రముఖ టెలికం కంపెనీ ఐడియా సెల్యులార్ సైతం డేటా ఛార్జీల్ని పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ.. పంజాబ్.. ఉత్తరప్రదేశ్ పశ్చిమ సర్కిళ్లలో ఈ ఛార్జీల పెంపు ఉంటుందని కంపెనీ చెప్పింది. మొత్తంగా చూస్తే.. నెలకు రూ.50మేర ఈ ఛార్జీల పెంపు కారణంగా భారం పడనుంది. ఈ రెండు ప్రముఖ కంపెనీలు డేటా ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకుంటే.. మరో ప్రముఖ కంపెనీ వోడాఫోన్ మాత్రం పాత ఛార్జీలనే కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. లాభాలు పెంచుకునే క్రమంలో.. పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా.. డేటా చార్జీల విషయంలో పెంపును మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని చెబుతున్నారు.