యూఎస్ స్ట్రీట్ ఫైట్‌ లో తెలుగు విద్యార్థులు!

Update: 2023-07-03 10:04 GMT
అమెరికాలో జరిగిన ఒక ఈవెంట్ లో తెలుగు విద్యార్థులు ఘర్షణకు దిగారనే వార్త, దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

పైగా చొక్కాలు చింపుకునే స్థాయిలో బహిరంగ ఘర్షణలకు దిగారని తెలుస్తుండటం  హాట్ టాపిక్ గా మారింది.

ఇల్లినాయిస్‌ లోని నేపర్‌ విల్లేలో జామర్స్ లైవ్ బ్యాండ్ ఈవెంట్ జరిగిందని తెలుస్తుంది.

ఈ సమయంలో పాటలు ప్లే చేసే విషయంలో వచ్చిందో.. లేక, మరే కారణమో స్పష్టంగా తెలియదు కానీ... ఆ నిర్వాహకులకు, విద్యార్థులకు మధ్య మాటల దూషణలు పెరిగి అవి ఫైనల్ గా ఘర్షణకు దారితీసినట్లు తెలిస్తుంది.

ఈ ఘర్షణలో ఒక వ్యక్తి చొక్కా చిరిగిపోవడం, ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో పిడిగుద్దులు గుద్దుకోవడం జరిగిందని అంటున్నారు.

దీంతో ఈ వ్యవహారం దిగ్భ్రాంతి కలిగించే స్థాయిలో ఉందని పలువురు ఆన్ లైన్ వేదికగా స్పందిస్తుంటుండగా…  హుందాతనం కోల్పోయారు, తెలుగు సమాజానికి ఇది అవమానం అనే మాటలు సైతం వినిపిస్తున్నాయి!

Similar News