రాజుల సొమ్ము రాళ్ల పాలు అయినట్టు.. దేవుడి భూములు కూడా పరాధీనం అయిపోతున్నాయి. పూర్వం దేవాలయాల నిర్వహణకు దాతలు - రాజులు - సంస్థానాధీశులు ఆ ఆలయాల పేరిట వందల ఎకరాలను రాసిచ్చేవారు. ఆ భూములపై వచ్చే ఆదాయంతో ఆలయాలు నడిచేవి. దూపదీప నైవేద్యాలు - అర్చకులకు వేతనాలు ఇచ్చేవారు.
అయితే తాజాగా ప్రకాశం జిల్లాలో దేవుడి భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. కబ్జాదారులు దేవుడి భూములను కొల్లగొట్టేస్తున్నారు. ఇక కౌలుకు తీసుకొని దేవస్థానాలకు కౌలు రూపంలో ఇవ్వాల్సిన సొమ్మును ఎగ్గొడుతున్నారు. లక్షల ఆదాయం దేవాదాయ శాఖ కోల్పోతున్నా నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు వ్యవహరిస్తుండడం విమర్శలకు దారితీస్తోంది.
ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో దాదాపు 500 ఎకరాల దేవస్థాన భూములు అన్యాక్రాంతమయ్యాయి. అవన్నీ అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లి కోట్ల రూపాయల నష్టం ప్రభుత్వానికి వాటిల్లింది.
కనిగిరి విజయమార్తేండశ్వరీ దేవస్థానానికి వివిధ ప్రాంతాల్లో దాదాపు 180 ఎకరాల మాన్యం భూములు ఉన్నాయి. వీటి విలువ ఏకంగా సుమారు 20కోట్ల రూపాయలు. దాదాపు మొత్తం భూములు అక్రమార్కుల చేతుల్లోకే పోయాయనే ఆరోపణలున్నాయి. కొందరు అక్రమార్కులు భూములు అక్రమించుకొని సాగుచేసుకోగా.. మరికొందరు కౌలుకు తీసుకొని లక్షల రూపాయల కౌలును దేవస్థానానికి ఎగ్గొట్టారు.
కనిగిరి విజయమార్తేండశ్వరీ దేవస్థానమే కాదు.. అయ్యన్నపాలెంలో దేవస్థాన భూముల పరిస్థితి కూడా ఇలానే తయారైంది. పామూరు వేణుగోపాల స్వామి దేవస్థానానికి చెందిన 266 ఎకరాలు - వల్లీ భుజంగేశ్వర దేవస్థానికి చెందిన 135 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. ఈ భూముల్లో ప్లాట్లు పెట్టి విక్రయించి కోట్లకు పడగలెత్తారన్న విమర్శలున్నాయి. ఈ భూముల విలువ 20కోట్లపైనే ఉంటుందట..
ఇక సీఎస్ పురం మండలం అయ్యలూరివారిపల్లిలో 200 ఏళ్లనాటి తిరుమలేషుడి ఆలయానికి సంబంధించిన 101 ఎకరాలను కౌలుకు తీసుకున్న వారు కౌలు ఇవ్వకుండా భూములు అప్పగించకుండా అనుభవిస్తున్నారు. దీనిపై దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఈ భూములు కొల్లగొట్టడంతో రెవెన్యూ అధికారులు లోపాయికారిగా సహకరించి దండుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇలా కోట్ల విలువైన భూములను కబ్జాదారులు దోచేస్తుండగా.. ఆ ఆలయాల పరిస్థితి మాత్రం తీసికట్టుగా తయారైంది. ఆలయాల్లో కనీస వసతులకు దాతలు చందాలు వేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఓవైపు దేవాదాయ శాఖకు నష్టం వాటిల్లుతూ ప్రభుత్వానికి కోట్ల రూపాయల లాస్ అవుతున్న ఈ మన్యం భూములను లెక్క తేల్చి స్వాధీనం చేసుకోవాలని భక్తులు కోరుతున్నారు.