విశాఖ ఎయిర్ పోర్ట్ లో విపక్ష నేత వైఎస్ జగన్ మీద దాడికి పాల్పడిన శ్రీనివాస్ కు సంబంధించిన విషయాల్లో ఏపీ ప్రభుత్వం.. అధికారులు అనుసరిస్తున్న విధానాలు పలు సందేహాలకు తావిచ్చేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ మీద దాడి జరిగిన కాసేపటికే ఈ అంశంపై స్పందించిన ఏపీ డీజీపీ ఠాకూర్.. నిందితుడు శ్రీనివాస్ జేబులో లేఖ దొరికిందని చెప్పారు.
కొద్దిసేపటి తర్వాత 11 పేజీల లేఖ అంటూ చెప్పటంపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉంటే.. ఎక్కడైనా.. ఏదైనా నేరం జరిగినప్పుడు తాము సేకరించిన ప్రాధమిక ఆధారాలకు సంబంధించి కొన్నింటి గురించి అధికారులు చెబుతుంటారు. లేఖలు లాంటివి ఉన్నప్పుడు వాటిని మీడియాకు విడుదల చేస్తుంటారు.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. జగన్ పై దాడి ఎపిసోడ్లో తొలుత శ్రీనివాస్ రాసిన లేఖకు బదులుగా.. అతన్ని ఇంటరాగేట్ చేసిన వీడియోక్లిప్ బయటకు వచ్చింది. తాజాగా శ్రీనివాస్ రాసినట్లుగా చెబుతున్న లేఖ ప్రతి బయటకు వచ్చింది. శ్రీనివాస్ దని చెబుతున్న ఈ లేఖ ఏకంగా 11 పేజీలు ఉండటం ఒక ఎత్తు అయితే.. మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకూ ఒకే దస్తూరి క్రమపద్దతిలో ఉండటం విశేషంగా మారింది.
ఎవరైనా సరే.. సుదీర్ఘంగా రాసేటప్పుటు మొదట్లో పొందిగ్గా రాసినా.. మధ్యలో కానీ చివరకు వచ్చేసరికి రాతలో మార్పు వచ్చేస్తుంది. మాంచి పోటుగాడు లాంటి రాతగాడు మాత్రమే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ ఒకే పద్దతిలో రాయటం ఉంటుంది. ఇంటర్ పూర్తి చేయని శ్రీనివాస్ చక్కటి తెలుగులో.. భావోద్వేగంతో.. మంచి మంచి పదాలతో లేఖ రాయటం సాధ్యమేనా? అన్నది ఒకప్రశ్న.
బాగా చేయితిరిగిన రాతగాడు రాస్తే ఎలాంటి పదాలు ఉంటాయో.. అలాంటివి ఉండటం పలువురిని విస్మయానికి గురి చేస్తోంది. ఈ లేఖ మొత్తం నాటకంగా.. పోలీసులు సృష్టించిన సరికొత్త ఆధారమన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఈ లేఖ చివరిలో సంబంధం లేకున్నా.. ఈ ఘటనలో తనకు ఏదైనా ప్రాణహాని జరిగితే తన అవయువాల్నిదానం చేయాలని ఉంది. లేఖ ముగించిన తీరు చూస్తే లేఖ మొత్తం కల్పిత వ్యవహారమేనా? అన్న సందేహాల్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. చంటి పేరుతో సంతకం చేసి పక్కన వేరే దస్తూరితో జనుపల్లె శ్రీనివాసరావు చిరునామ రాసి ఉంది.సీఐఎస్ఎఫ్అసిస్టెంట్ కమాండెంట్.. చీఫ్ సెక్యురిటీ అధికారి సంతకాలతో విడుదలైన ఈ లేఖపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ లేఖపై వెల్లువెత్తుతున్న సందేహాలు జగన్ దాడి వెనుక పెద్ద కుట్ర ఉందన్న భావనకు మరింత బలం చేకూర్చేటట్లు ఉన్నట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు.