వివాదాస్పద సినీ విమర్శకుడు కత్తి మహేష్ చిక్కుల్లో పడ్డారు. కత్తి మహేష్ పై కేసు నమోదు చేయాలని తెనాలి కోర్టు తాజాగా పోలీసులను ఆదేశించింది. జూన్ 29న ఒక న్యూస్ చానెల్ నిర్వహించిన చర్చలో పాల్గొన్న కత్తి మహేష్.. సీతారాములను దూషించి హిందువుల మనోభావాలను దెబ్బ తీశారని హిందూ వాహిని ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. అయితే పోలీసులు స్పందించకపోవడంతో హిందూ వాహిని అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ తాజాగా తెనాలి కోర్టులో పిటీషన్ వేశారు. దీన్ని విచారించిన కోర్టు తాజాగా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారని రామకృష్ణ శనివారం తెలిపారు..
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి బహిష్కరించాక కత్తి మహేష్ తన సొంతూరు చిత్తూరు జిల్లాకు వెళ్లారు. అక్కడి నుంచి బెంగళూరులో కొద్దికాలం ఉన్నారు. ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారన్నది తెలియదు.. కోర్టు కేసు నేపథ్యంలో ఆయన బయటకు వచ్చే అవకాశాలున్నాయి. తన సోషల్ మీడియా ఖాతాల్లో కూడా కత్తి పెద్దగా స్పందించకపోవడం గమనార్హం.