ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా

Update: 2020-07-19 07:46 GMT
ఏపీలో రోజురోజుకి కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. తాజాగా కేసుల సంఖ్య 40వేల మార్క్ దాటింది.  ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులకు ఈ వైరస్ సోకింది. ఇప్పుడు ఎమ్మెల్యేలను కూడా వదలడం లేదు. ఇటీవలే శ్రీశైలం - శ్రీకాళహస్తి ఎమ్మెల్యేకు కూడా కరోనా వ్యాపించినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ రావడం గమనార్హం.

ఏపీలో భారీ సంఖ్యలో టెస్టులు చేస్తుండడంతో రోజుకు 2500పైగానే కేసులు నమోదవుతున్నాయి. దీంతో కరోనా కొత్త రికార్డులు సృష్టిస్తోంది.

తాజాగా రెండు సార్లు పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా ఎమ్మెల్యేకు మూడోసారి నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు పాజిటివ్ గా వచ్చింది.

ఇప్పటికే రెండు సార్లు కరోనా టెస్ట్ చేయిస్తూ నెగెటివ్ వచ్చిందని.. కొంచెం జలుబు ఉండడంతో మూడోసారి కూడా కరోనా టెస్టు చేయించానని.. ఈసారి మాత్రం పాజిటివ్ వచ్చిందని ఎమ్మెల్యే శివకుమార్ తెలిపారు. తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. బాగానే ఉన్నానని వివరించాడు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేశారు.

ఏపీలో వరుసగా ఎమ్మెల్యేలందరూ కరోనా బారిన పడుతుండడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే అధికారులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయి పర్యటనలు తగ్గించుకుంటున్నారు.


Tags:    

Similar News