చరిత్ర సృష్టించిన టెన్నిస్ దిగ్గజం జకోవిచ్

Update: 2023-06-12 10:18 GMT
టెన్నిస్ దిగ్గజం క్రీడా కారుడు నొవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను మూడోసారి సాధించాడు. దాని తో పాటు మరో టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ రికార్డు ను జకోవిచ్ బద్దలు కొట్టాడు. దీని తో ఆయన అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.

టెన్నిస్ క్రీడాకారుడు రాఫెల్ నాదల్ ఇప్పటి వరకు పురుషుల సింగిల్స్ టెన్నిస్‌ లో 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచు కున్నాడు. జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో విజయంతో 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్ల ను గెలుచుకున్న మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు జకోవిచ్.

దాంతో ప్రపంచ నంబర్ 3 వ స్థానం నుంచి తిరిగి అగ్ర స్థానానికి చేరుకున్నాడు జకోవిచ్. ఆదివారం ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్‌ లో 36 ఏళ్ల వయసు ఉన్న జకోవిచ్ నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ ను 7-6, 6-3, 7-5 తేడా తో ఓడించాడు. అయితే... 36 ఏళ్ల వయస్సులో 20 రోజులు ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన పెద్ద వయస్సు ఆటగాడిగా నూ జకోవిచ్ నిలిచాడు. అదేవిధంగా మూడు సార్లు యూఎస్ ఓపెన్ గెలుచుకున్నాడు జకోవిచ్.

ఒవరాల్ టెన్నిస్‌ లో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన రెండో ప్లేయర్ గా సెరెనా విలియమ్స్ తో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. సింగిల్స్ విభాగం లో ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ మార్గ రెట్ కోర్ట్ 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో అత్యధిక టైటిల్స్ నెగ్గిన ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. జకొవిచ్ సరి కొత్త రికార్డు ను నెలకొల్పడంతో మరో టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ ట్విటర్ వేదికగా జకోవిచ్ కు అభినందనలు తెలిపారు.

ఆయన ట్విట్టర్ లో రాస్తూ... " 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ దక్కించుకోవటం అనేది కొన్ని సంవత్సరాల క్రితం ఆలోచించడం సాధ్యం కాని సంఖ్య. మీరు దాన్ని చేరుకున్నారు. ఈ ఆనందాన్ని మీ కుటుంబం, మీ బృందంతో పంచుకోండి "అంటూ నాదల్ వెల్లడించారు. ఇక జకోవిచ్ గెలుపు తో అభిమానుల్లో ఫుల్ జోష్ వచ్చింది. ఆయన విజయాన్ని సంబరాలు జరుపుకుంటున్నారు.

Similar News