వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత.. ఫైర్‌బ్రాండ్‌కు నిలువెత్తు రూపంగా వ్యవహరించే నగరి ఎమ్మెల్యే రోజాతో వ్యవహారం అంత సింఫుల్ కాదు. ఆమెతో సున్నం పెట్టుకోవటం అంటే కష్టాల్ని చేతులారా కొని తెచ్చుకున్నట్లే. ఆమె తీరుతో అసెంబ్లీలో ఏపీ అధికారపక్ష నేతలు మొదలు.. అధికారులు వరకు వణికి పోతున్నారు. ఆమె తీరును తట్టుకోలేక.. విప్ లాంటి వ్యక్తి.. అసెంబ్లీలో ఆమె వ్యవహరించే తీరుపై సీడీలు టీవీలకు విడుదల చేయాల్సి వచ్చింది.
అధికారపక్ష నేతలపై ఆమె ఏ రేంజ్‌లో విరుచుకుపడతారో సీడీల్ని చూసిన తర్వాత చాలామందికి అర్థమైంది. ఇక.. ఆమె మాటలు ఎంత పదునుగా ఉంటాయో కూడా తెలిసిందే. అధికారపక్షాన్ని టార్గెట్ చేస్తున్నారు? మీకు.. భయం లేదా? అని అడిగితే.. ఏం చేస్తారు? రేప్ చేస్తారా? అంత దమ్ము లేదు.. చంపుతారా? చంపలేరు. మహా అయితే ఎస్సీ..ఎస్టీ కేసు పెట్టిస్తారు అంతేగా అంటూ దూకుడుగా మాట్లాడటం ఆమెకే చెల్లింది.
తాజాగా ఆమె పుత్తూరులో జరగాల్సిన మండల సర్వసభ్య సమావేశాన్ని భగ్నం చేయటానికి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా కాస్తంత రచ్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార.. విపక్ష సభ్యుల మధ్య అనవసర ఉద్రిక్తలు తలెత్తకుండా చూసేందుకు పోలీసులు విపరీతంగా కష్టపడాల్సి వచ్చింది. మొత్తంగా తాము అనుకున్నట్లుగా మండ సర్వసభ్య సమావేశాన్ని జరగకుండా చేయటంలో రోజా అండ్ కో సక్సెస్ అయ్యారు.
ఈ సందర్భంగా అధికారపక్షంపై విపక్షం విమర్శలు చేశారు. దీనికి అధికారపక్షనేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నినాదాలు చేయటంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా అక్కడే ఉన్న సీఐ (సర్కిల్ ఇన్‌స్పెక్టర్)ను ఎమ్మెల్యే రోజా పిలిచారు. ఆయన.. ఆమె దగ్గరకు వెళ్లకుండా అక్కడే నిలబడి చెప్పండి మేడమ్ అని అడిగారు. దీంతో.. తన దగ్గరకు రమ్మని పిలిస్తే సీఐ రాకపోవటం విపరీతమైన ఆగ్రహానికి గురయ్యారు. ఇక్కడో ఇంకో విషయాన్ని ప్రస్తావించాలి. ఆమె దగ్గరకు పిలిస్తే.. వెళితే.. లేనిపోని గొడవలు అవుతాయన్నది సీఐ బాధ.
చూస్తూ.. చూస్తూ ఫైర్‌బ్రాండ్ దగ్గరకు వెళ్లి ఆమెతో పెట్టుకునే సాహసం చేయలేక.. దూరం నుంచే చెప్పండి మేడమ్ అనటం.. అందుకు రోజాకు కోపం వచ్చేసి.. ''మేమేమీ ఎస్సీ.. ఎస్టీలం కాదు. దగ్గరకు రండి'' అంటూ నోరు జారారు.
విధి నిర్వహణలో ఉన్న ఒక అధికారిని హెచ్చరించేలా ఆమె చేసిన వ్యాఖ్యలపై అక్కడి వారు మండి పడ్డారు. దగ్గరకు రానంత మాత్రనా ఎస్సీ.. ఎస్టీలు అయిపోరు కదా. అయినప్పటికీ తన నోటి దూకుడుతో పెద్దగా అరిచేసరికి అక్కడి వారికి మంట పుట్టింది. దీంతో.. రోజా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగి.. రెండు వర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకునే వరకూ వ్యవహారం వెళ్లింది. రోజా లాంటి నేత పిలిచినంతనే వెళ్లినా కష్టమే.. వెళ్లకుండా కాస్త దూరంగా ఉండి మర్యాదగా మాట్లాడినాకష్టమే అంటూ అక్కడి పోలీసులు.. అధికారులు వాపోతున్నారు.