కేసీఆర్ బ‌ర్త్‌డే.. : టీఆర్ ఎస్‌.. కాంగ్రెస్ మ‌ధ్య ర‌గ‌డ‌.. కోస్గిలో ఉద్రిక్త‌త‌

Update: 2022-02-17 14:32 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుక ఒక‌వైపు.. అదేస‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ నిర‌స‌న మ‌రోవైపు.. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా.. గురువారం.. తీవ్ర ఉద్రిక్త‌త ఏర్ప‌డింది.

జ‌న్మ‌దిన వేడుక‌ల సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని.. కాంగ్రెస్ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి.. నాయ‌కుల‌కు.. కార్య‌క‌ర్త‌లకు ఒక పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వంటి విషయాలపై నిర‌స‌న‌గా.. గ‌ళం విప్పాల‌ని రేవంత్ పిలుపునిచ్చారు.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఉద్య‌మాలు చేప‌ట్టాయి. చాలా చోట్ల న‌నేత‌లు.. రోడ్డు మీద‌కు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే.. ముందుగానే అలెర్ట్ అయిన‌.. అదికార పార్టీ.. ఎక్క‌డిక‌క్క‌డ .. పోలీసుల‌ను మోహ‌రించి.. దొరికిన వారిని దొరికిన‌ట్టు నాయ‌కుల‌ను అరెస్టు చేయించింది.

ఈక్ర‌మంలో.. కీల‌క నాయ‌కులు చాలా మంది అరెస్టు అయ్యారు. మ‌రోవైపు.. ఈ స‌మ‌యంలోనే.. ప్ర‌తిగా.. టీఆర్ ఎస్ శ్రేణులు కూడా రోడ్డు మీద‌కు రావ‌డంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య ఉద్రిక్త‌త నెల‌కొని.. దాడుల‌కు.. కూడా దారి తీసింది.

యూత్ కాంగ్రెస్ చేపట్టిన నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్తున్న తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు తరలిం చారు. మ‌రోవైపు.. ఉమ్మ‌డి వికారాబాద్ జిల్లాలోని నారాయ‌ణ‌పేట్ జిల్లాలో ఉన్న కోస్గిలో మ‌రింత ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి.

కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో ఒకరినొకరు కొట్టుకున్నారు. సీఎం కేసీఆర్‌ను హేళన చేసే విధంగా ఆయన పుట్టిన రోజు వేడుకను జరిపేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధమయ్యారు.

ఈ క్ర‌మంలో  గాడిదతో కేక్ కట్ చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న టీఆర్ఎస్ ఎంఎల్ఎ ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నారు.

దీంతో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు కర్రలతో దాడి చేసుకన్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ ఛార్జీ చేసి.. రెండు వర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం కోస్గిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాలు సంయమనం పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
Tags:    

Similar News