ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో పేలుళ్లకు ఉగ్రవాదులు పన్నిన కుట్ర భగ్నమైంది. దసరా పండుగ నేపథ్యంలోని భారతదేశంలోని ప్రధాన నగరాలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం నిజమైంది. హైదరాబాద్ లో భారీ ఉగ్రకుట్ర బయటపడింది.
చారిత్రక నగరమైన హైదరాబాద్ లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేశారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దాడులకు ప్రణాళిక రచించిన ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. అనంతరం విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులలో ఒకరైన జాహెద్ ను ప్రశ్నించగా అనేక విషయాలు వెల్లడయ్యాయి. ఆరుప్రాంతాల్లో బాంబు పేలుళ్లలకు జాహెద్ కుట్ర చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో దసరా సందర్భంగా హైదరాబాద్ కు పెద్ద ముప్పు తప్పినట్టైంది.
దసరా పండుగ వేళ కల్లోలం సృష్టించాలన్న టెర్రరిస్టుల ప్లాన్ ను పోలీసులు భగ్నం చేయడంతో హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడికి పథకం వేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన అబ్దుల్ జాహెద్, అబ్దుల్ సమీ, మాజ్ హాసన్ గా పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడైన అబ్దుల్ జాహెద్ ను ఐఎస్ఐ , లష్కరే తొయిబాలతో లింక్ లు ఉన్నాయి.
జాహెద్ గ్యాంగ్ నుంచి నాలుగు గ్రానేడ్లు, దాదాపు రూ.5.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. జాహెద్ చరిత్ర చూస్తే హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఉగ్రదాడుల్లో నిందితుడు. 2005లో బేగంపేటలో టాస్క్ ఫోర్స్ ఆఫీసుపై జరిగిన ఆత్మాహుతి దాడిలో ప్రమేయం ఉందని పోలీసులు గతంలో ఓసారి అరెస్ట్ చేశారు.
2002లో దిల్ సుఖ్ నగర్ సాయిబాబా ఆలయం దగ్గర దాడుల్లో జుహెద్ గ్యాంగ్ పాత్ర ఉంది. హైదరాబాద్ లో అలజడి సృష్టించాలన్నది వీరి ముగ్గురి ప్లాన్. ఆ ఏర్పాట్లలో ఉండగానే పోలీసులు ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ పేలుళ్ల కోసం పాకిస్తాన్ నుంచి నిధులు అందినట్టు పక్కా సమాచారాన్ని పోలీసులు సేకరించారు. పాక్ నుంచి హ్యాండ్ గ్రెనెడ్లతో దాడులకు ప్లాన్ చేసినట్టు సమాచారం.
పాకిస్తాన్ నుంచి నేపాల్ మీదుగా జుహెద్ కు హ్యాండ్ గ్రెనేడ్లు చేరినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దీని కోసం రెక్కి చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఆరు ప్రాంతాల్లో జుహెద్ గ్యాంగ్ రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఐదురోజుల కిందట తొమ్మిది మందితో సమావేశమై పేలుళ్ల కోసం వ్యూహరచన చేశారని తెలిసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.