వినియోగదారులకు టెస్లా శుభవార్త... త్వరలో భారత్ లో ఏర్పాటుకు సన్నాహాలు

Update: 2021-04-09 03:37 GMT
ఎలక్ట్రానిక్ కార్ల దిగ్గజం టెస్లా వినియోగదారులకు తీపి కబురు అందించింది. త్వరలో భారత్ లో షోరూమ్ లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క జరుగుతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. దేశంలో టెస్లా కార్యకలాపాలు నిర్వర్తించడానికి ఒక ఎగ్జిక్యూటివ్ ను నియమించినట్లు తెలుస్తోంది.

భారత్లో తమ కార్యకలాపాలు విస్తరించడానికి ఇప్పటికే స్థానికంగా సంస్థ పేరును నమోదు చేసింది. ఈ ఏడాదిలో ఎలాగైనా మోడల్ 3 సెడాన్ ను భారత్ లో స్వయంగా విక్రయించాలని చర్యలు చేపట్టింది. దేశ రాజధాని దిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయి, టెక్ రాజధాని బెంగుళూరులో టెస్లా షోరూమ్ లు, సర్వీసు కేంద్రాలు తెరవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూడు నగరాల్లో అనువైన ప్రదేశాల కోసం గాలిస్తున్నట్లుగా సమాచారం.

సంపన్నవర్గాల వినియోగదారులు సులభంగా కారు కొనే వీలుండేలా స్థల పరిశీలన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా 20 వేల నుంచి 30 వేల చదరపు అడుగల వరకు ఉన్న వాణిజ్య భవనాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థల పరిశోధన బాధ్యతను గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సీబీఆర్ కు అప్పగించినట్లు సమాచారం అందుతోంది. టెస్లాకు అనువైన ప్రదేశం కోసం ఆ సంస్థ కొన్ని వారాలుగా గాలిస్తోంది.

భారత్ లో టెస్లా షోం తెరిస్తే దేశంలో ఈ కార్లకు మంచి డిమాండ్ వస్తుందని నిపుణులు అంటున్నారు. భారతీయులకు టెస్లాపై ఒకరకమైన మోజు ఉంది. ఇక దేశంలోనే విక్రయాలు జరిగినప్పుడు అది ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే ఈ వార్త టెస్లా ప్రియులకు నిజంగా శుభవార్తే మరి. 
Tags:    

Similar News