ఆ బీజేపీ ఎమ్మెల్సీ ..జ‌గ‌న్ సీక్రెట్స్ లీక్ చేశాడే !

Update: 2022-07-06 02:30 GMT
వివాదాస్ప‌ద ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు అలియాస్ ట్రిపుల్ ఆర్ మ‌ళ్లీ మీడియా ముందుకు వ‌చ్చారు. సాయిరెడ్డి చేసిన ట్వీట్ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. అదేవిధంగా ప్ర‌ధాని స‌భ‌కు (భీమవ‌రంలో నిర్వ‌హించిన సభ‌, స్థ‌లం : పెదఅమిరం) రానివ్వ‌కుండా వైసీపీ స‌ర్కారు ఏ విధంగా ఆటంకాలు ఏర్ప‌రిచిందో కూడా చెప్పారాయ‌న.

తాను ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం న‌ర‌సాపురం ఎక్స్ ప్రెస్ ఎక్కేశాన‌ని, అదే ట్రైన్లో కిష‌న్ రెడ్డి (కేంద్ర‌మంత్రి) కూడా ఎక్కేస్తార‌ని అనుకున్నాన‌ని, కానీ ఆఖ‌రి నిమిషంలో జ‌గ‌న్ చెప్పిన విధంగా ఆయ‌న ఆ ట్రైన్ ఎక్కలేద‌ని చెప్పారాయ‌న.

అదేవిధంగా రైల్వే స్టేష‌న్ ద‌గ్గ‌ర పోలీసులు మోహ‌రించి ఉండ‌డంపై అనుమానం వ‌స్తే త‌న‌కు బీజేపీ ఎమ్మెల్యీ పీవీఎన్ మాధవ్ ముంద‌స్తు స‌మాచారం ఇచ్చార‌ని, దాంతో తాను అప్ర‌మ‌త్త‌మై రైలు దిగేశాన‌ని అన్నారు.

తాను స‌భ‌కు రాకుండా అడ్డంకులు సృష్టించిన వారే త‌న‌పై వ్యంగ్య పూరిత వ్యాఖ్య‌లు (సెటైరిక‌ల్ కామెంట్స్ ) చేయ‌డం త‌గ‌ద‌ని ఎంపీ సాయి రెడ్డిని ఉద్దేశించి అన్నారు. తాను ఎక్కే ట్రైన్ ఆంధ్రా బోర్డ‌ర్ లోకి రాగానే త‌న‌ను అదుపులోకి తీసుకునేందుకే పోలీసులకు జ‌గ‌న్ ఆదేశాలు ఇచ్చార‌ని ఆరోపించారు.

ఈ స‌మాచారం కూడా త‌న‌కు కొంద‌రు పోలీసులే అందించార‌న్న‌ది ఆయ‌న మాట. అదేవిధంగా  ట్రైన్ స‌త్తెన్న‌ప‌ల్లి స్టేష‌న్ ద‌గ్గ‌ర‌కు రాగానే భోగీలు త‌గులబెట్టేందుకు కూడా ఓ కుట్ర ప‌న్నార‌ని ఆయ‌న సంచలనాత్మ‌క ఆరోప‌ణ ఒక‌టి చేశారు.  ఇదే సంద‌ర్భంగా మంత్రి రోజా రెడ్డి చేసిన కామెంట్స్ పై మాత్రం పెద్ద‌గా స్పందించ‌లేదు.

త‌నను ఉద్దేశించి ఫెగ్గూ, విగ్గూ అని సాయి రెడ్డి అన‌డం భావ్యంగా లేద‌ని అన్నారు. న‌ల్ల‌గా ఉండే రోజా మేక‌ప్ ఎందుకు వేసుకుంటున్నార‌ని అన్నారు. అదేవిధంగా రోజా చెప్పిన విధంగా త‌న‌కు వైసీపీ ఏమీ రాజ‌కీయ జీవితం ఇవ్వ‌లేద‌ని, తానే వైసీపీకి జీతం ఇచ్చాన‌ని చెప్పారు.
Tags:    

Similar News