ఆ సంక్షోభ బ్యాంకు.. అపర కుబేరుడి చేతికి? డిజిటల్ బ్యాంక్ చేస్తారా?

Update: 2023-03-12 07:00 GMT
అమెరికా మార్కెట్లో స్టార్టప్ కంపెనీల షేర్ల పతనానికి సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్ కారణమని అందరూ చెబుతున్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి బయట పెద్దగా తెలియని ఈ బ్యాంకు పతనం ఇప్పుడు అంకుర సంస్థలు, టెక్‌ వర్గాల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. బ్యాంక్‌ను నియంత్రణ సంస్థలు మూసివేసి, ఆస్తులను జప్తు చేయడంతో ఈ బ్యాంకు మాతృ సంస్థ ఎస్‌వీబీ ఫైనాన్షియల్‌ గ్రూప్‌ షేరు దాదాపు 60 శాతం కుంగాయి. శాంతాక్లారా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఎస్‌వీబీ ఫైనాన్షియల్‌ గ్రూప్‌ అనుబంధ సంస్థే సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌.

అమెరికాలో 16వ పెద్ద బ్యాంకు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అమెరికాలో 16వ అతిపెద్ద బ్యాంక్‌. టెక్‌ ఆధారిత వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌లకు నిధులు అందిస్తుంది. ఎస్‌వీబీ ఫైనాన్షియల్‌ గ్రూప్‌ తన పోర్ట్‌ఫోలియోలో నష్టాలను పూడ్చుకోవడం కోసం, ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు 21 బిలియన్‌ డాలర్ల సెక్యూరిటీలను విక్రయించినట్లు.. 2.25 బిలియన్‌ డాలర్ల వాటా విక్రయాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇక్కడి నుంచే అంతా మారిపోయి పతనం మొదలైంది. నికర వడ్డీ ఆదాయాల్లో భారీ క్షీణత నమోదు కావచ్చని ఎస్‌వీబీ పేర్కొనడంతో అగ్నికి ఆజ్యం పోసింది. ఎస్‌వీబీ ప్రకటన రావడం ఆలస్యం.. బ్యాంకు డిపాజిట్లలో అధిక మొత్తం ఉపసంహరణకు గురయ్యాయి. దీంతో పెట్టుబడులను పరిమితం చేసుకోవాలని, డబ్బును ఉపసంహరించుకోవాలని పలువురు వెంచర్‌ క్యాపిటలిస్టులు తమ పోర్ట్‌ఫోలియో వ్యాపార సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు.

వేరొక బ్యాంకుకు నగదు బదిలీ చేయమని మరికొన్ని వీసీ సంస్థలు, పోర్ట్‌ఫోలియో కంపెనీలకు తెలిపాయి. కొన్ని మాత్రమే ఎస్‌వీబీకి అండగా నిలబడ్డాయి. ఈ సమస్యలకు తోడు సిల్వర్‌గేట్‌ క్యాపిటల్‌ కార్ప్‌ మూసివేతా సంభవించడంతో, బ్యాంకింగ్‌ షేర్లను కిందకు లాగాయి. ఈ పరిణామల మధ్య ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఈ బ్యాంకు ఆస్తులను జప్తు చేసింది. దీంతో 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో వాషింగ్టన్‌ మ్యూచువల్‌ తర్వాత అతిపెద్ద బ్యాంకు వైఫల్యంగా ఇది నమోదైంది. ఎస్‌వీబీ ఫైనాన్షియల్‌ గ్రూప్‌ షేరు 35 ఏళ్లలోనే అత్యంత అధ్వానంగా ముగిశాయి. గురువారం ఏకంగా 60% క్షీణించడంతో 80 బిలియన్‌ డాలర్ల నష్టం వచ్చింది. వెంచర్‌ క్యాపిటలిస్టులకు సర్దిచెప్పడానికి బ్యాంకు ప్రయత్నం చేసింది. అయితే శుక్రవారం పరిణామంతో ట్రేడింగ్‌ మొదలవడానికి ముందే ఈ షేర్లలో ట్రేడింగ్‌ను నిలిపేశారు. గత సెప్టెంబరులో 406 డాలర్ల వద్ద ఉన్న ఎస్‌వీబీ ఫైనాన్షియల్‌ గ్రూప్‌ షేరు, ప్రస్తుతం 106 డాలర్లకు పతనమైంది. గత 5 రోజుల్లోనే షేరు విలువ 178 డాలర్లకు పైగా  క్షీణించింది.

అమెరికా అంకురాలకు ఎస్‌వీబీకి విడదీయలేని సంబంధం ఉంది. సిలికాన్‌ వ్యాలీ, టెక్‌ అంకురాలకు ఈ బ్యాంకే ఆర్థిక సహాయం చేస్తోంది. అమెరికాలోని సగం వెంచర్‌ క్యాపిటల్‌ మద్దతున్న అంకురాలతో ఇది వ్యాపారం చేస్తోంది. అమెరికాలో 44 శాతం టెక్‌, ఆరోగ్య సంరక్షణ కంపెనీలకూ ఇదే ఆధారం. సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ ఎక్కువ టెక్‌ పరిశ్రమకే రుణాలిచ్చినందున.. ఈ పరిణామం ఇతర బ్యాంకులపై చూపకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ప్రధాన బ్యాంకులకు ఈ తరహా పరిస్థితులు రాకుండా కావలసినంత నిధులున్నాయని చెబుతున్నారు.

మస్క్ కొంటారా?

అయితే, బ్యాంకు వ్యవహారాల్లో ఓ కీలక పరిణామం. ఇటీవలే రూ.3.5 లక్షల కోట్లు పెట్టి ట్విటర్ ను కొన్న అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ఇప్పుడు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ను కొనుగోలు చేస్తా అంటున్నారు. దానిని డిజిటల్ బ్యాంక్‌గా మార్చడాన్ని ట్విట్టర్ పరిగణించాలని రేజర్ సీఈఓ మిన్-లియాంగ్ టాన్ సూచించారు. దీనిపై మస్క్ స్పందిస్తూ, "నేను ఆలోచనకు సిద్ధంగా ఉన్నాను" అని అన్నారు. కాగా, సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ సంక్షోభానికి ముందే ఆ బ్యాంక్‌ సీఈఓ తన షేర్లను విక్రయించినట్లు తెలిసింది. 10 రోజులముందే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఫైనాన్షియల్‌లో ఉన్న 3.6 బిలియ్‌ డాలర్ల విలువైన 12,451 షేర్లను ఫిబ్రవరి 27న విక్రయించారని తెలిసింది. షేర్ల విక్రయానికి అనుమతి ఇవ్వాలని జనవరి 26నే నియంత్రణ సంస్థలను బెకర్‌ కోరినట్లు వెల్లడైంది. బ్యాంకింగ్‌ సంక్షోభానికి కొద్ది రోజుల ముందే  బెకర్‌ తన షేర్లను విక్రయించడం చర్చనీయాంశమైంది. దీనిపై అటు బెకర్‌గానీ, ఎస్‌వీబీ గ్రూప్‌ గానీ అధికారికంగా స్పందించలేదు. బ్యాంకులో వాటాల విక్రయం ప్రతిపాదన గురించి బెకర్‌కు ముందే తెలుసా అనేదీ తెలియరాలేదు.

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కాలిఫోర్నియా, మసాచుసెట్స్‌లో మొత్తం 17 శాఖలు కలిగి ఉంది. కాలిఫోర్నియా బ్యాంక్ రెగ్యులేటర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అండ్ ఇన్నోవేషన్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకునే ఆర్డర్ ప్రకారం చూస్తే.. మార్చి 9న వ్యాపారం ముగిసే సమయానికి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ $958 మిలియన్ల ప్రతికూల నగదు నిల్వను కలిగి ఉంది. ఎవీబీ ఫైనాన్షియల్‌ గ్రూప్‌ అనుబంధ సంస్థ అయిన సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌.. టెక్‌ ఆధారిత వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌లకు నిధులు సమకూరుస్తుంటుంది. నష్టాలను పూడ్చుకోవడం, పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేసేందుకు 21 బిలియన్‌ డాలర్ల సెక్యూరిటీలను విక్రయించడంతో పాటు 2.25 బిలియన్‌ డాలర్ల వాటా విక్రయాన్ని నిర్వహించనున్నట్లు ఎస్‌వీబీ ఫైనాన్షియల్‌ గ్రూప్‌ గురువారం ప్రకటించింది. నికర వడ్డీ ఆదాయాల్లో భారీ క్షీణత నమోదు కావచ్చనీ పేర్కొంది. దీంతో బ్యాంకు డిపాజిట్లలో అధిక మొత్తం ఉపసంహరణకు గురయ్యాయి. గురువారం ఏకంగా ఎస్‌వీబీ ఫైనాన్షియల్‌ గ్రూప్‌ షేర్లు ఏకంగా 60% క్షీణించడంతో 80 బిలియన్ల డాలర్ల నష్టం వచ్చింది. శుక్రవారం ట్రేడింగ్‌ను నిలిపివేయడంతో పాటు బ్యాంక్‌ను అక్కడి నియంత్రణ సంస్థలు మూసివేశాయి. ఆస్తులనూ జప్తు చేశాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News