కరోనా మహమ్మారిని నియంత్రించడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు వ్యాక్సిన్ అభివృద్ధి చేశాయి. వాటిలో చాలావరకు పెద్దల కోసమే ఉన్నాయి. చిన్నారుల కోసం ఇప్పటివరకు ఒక్క వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఆ దిశగా వివిధ సంస్థలు ప్రయోగాలు ఆరంభించాయి. అందులో భాగంగానే బాలల కోసం మోడెర్నా టీకా తయారు చేస్తోంది. ఇది పిల్లలపై వందశాతం సమర్థవంతంగా పని చేస్తోందని ఆ సంస్థ వెల్లడించింది.
12 నుంచి 17 ఏళ్ల పిల్లలపై చేసిన ప్రయోగాల్లో మోడెర్నా టీకా సానుకూల ఫలితాలు ఇచ్చిందని ఆ సంస్థ వెల్లడించింది. 3,732 మంది చిన్నారులపై నిర్వహించిన ఫలితాల్లో ఈ టీకా సమర్థవంతంగా పని చేసిందని తెలిపింది. అనుమతుల కోసం ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కు త్వరలోనే దరఖాస్తులు చేస్తామని పేర్కొంది. అమెరికాలో పిల్లలకు ఇవ్వడానికి ఫైజర్ టీకా ఇప్పటికే అనుమతులు పొందింది.
మోడెర్నా వ్యాక్సిన్ కు ఎఫ్డీఏ అనుమతులు ఉన్నాయి. చిన్నారుల కోసం అభివృద్ధి చేసిన ఈ టీకాకు గ్రీన్ సిగ్నల్ వస్తే టీకా పంపిణీని విస్తరింపజేయనుంది. అనుమతులు వస్తే ఉత్పత్తి పెంచనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఎం-ఆర్ఎన్ఏ 1273 సాంకేతికతో ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. పిల్లల కోసం వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలని తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు.
భారత్ లో ప్రస్తుతం రెండో దశ ప్రభావం తీవ్రంగా ఉంది. త్వరలో మూడో దశలో వైరస్ విజృంభిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. పిల్లలు సురక్షితంగా ఉండడానికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలని కోరుతున్నారు.