అందుకే ఆయన్ను ట్రంప్ అనేది..బైడెన్ విజయం తర్వాత స్పందన ఇదే

Update: 2020-11-08 04:45 GMT
ఎంత పోటీ పడినా.. ఫలితం తేలిపోయిన తర్వాత ఓటమిని అంగీకరిస్తే వచ్చే హుందాతనం అంతా ఇంతా కాదు. అలాంటివి తన డీఎన్ఏలోనే ఉండవన్నట్లుగా వ్యవహరించే డొనాల్డ్ ట్రంప్.. తాజాగా తన తీరును మరోసారి ప్రపంచానికి చాటారు. పోటాపోటీగా సాగిన అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎంపిక కావటానికి అవసరమైన 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లకు అదనంగా మరో 20 ఓట్లను సొంతం చేసుకొని అపురూప విజయాన్ని సొంతం చేసుకున్నారు.

బైడెన్ విజయంపై ట్రంప్ స్పందన ఏమిటి? ఆయనేం మాట్లాడారన్నది చూస్తే.. ఇంత జరిగిన తర్వాత కూడా ట్రంప్ మారరా? అన్న సందేహం కలుగక మానదు. బైడెన్ గెలుపు ఖరారైన తర్వాత స్పందించిన ట్రంప్.. ఇప్పటివరకు ఆయన గెలుపును ఏ రాష్ట్రం కూడా ప్రకటించలేదంటూ మరో వివాదానికి తెర తీశారు.

‘ఈ ఎన్నికలు చాలా దూరంగా ఉన్నాయి. జో బైడెన్ విజయం సాధించినట్లు ఏ రాష్ట్రం కూడా కన్ఫర్మ్ చేయలేదు. మా టీం సోమవారం నుంచి న్యాయపోరాటాన్ని ప్రారంభిస్తుంది’ అంటూ వ్యాఖ్యానించారు. ఇదంతా చూస్తుంటే.. అమెరికాలో అధికార బదిలీ గతానికి భిన్నంగా జరగటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. రానున్న రోజుల్లో ట్రంప్ మరెన్ని సంచలనాలకు శ్రీకారం చుడతారో?
Tags:    

Similar News