అమెరికాలో మనమ్మాయిని వాడు అందుకే చంపేశాడట?

Update: 2019-11-28 05:26 GMT
సంచలంగా మారిన హైదరాబాదీ అమ్మాయిని అమెరికాలో రేప్ చేసిన చంపేసిన ఉదంతంలో నిందితుడు తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. తాను చంపటానికి వాడు చెప్పిన కారణం వింటే రక్తం మరిగిపోవటం ఖాయం. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడిన కుటుంబానికి చెందిన 19 ఏళ్ల రూత్ జార్జ్ యూనివర్సిటీ వెనుక భాగంలో అత్యాచారానికి గురై హత్య చేయబడిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనలో నిందితుడైన డొనాల్డ్ తుర్మాన్ ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ సందర్భంగా అతగాడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. తాను పిలిస్తే తనతో మాట్లాడేందుకు నిరాకరిచటం.. తాను పిలిస్తే రియాక్ట్ కాలేదన్న కోపంతో నిందితుడు బాధితురాలిని చంపేసి ఉంటారని ప్రాసిక్యూటర్ వెల్లడించారు.

నిందితుడు నేరం ఒప్పుకున్నట్లుగా ప్రాసిక్యూటర్ జేమ్స్ మర్ఫీ వెల్లడించారు.  యూనివర్సిటీ క్యాంపస్ నుంచి జార్జ్ పార్కుకు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు తుర్మన్ పిలిచాడని.. అయితే.. ఆమె పలకలేదు. దీంతో కారు గ్యారేజ్ లోకి వెళుతున్న జార్జ్ ను వెంబడించాడు. ఆమె చాలా అందంగా ఉందని.. తనతో మాట్లాడాలని భావించినా ఆమె రియాక్ట్ కాలేదు. దీంతో కోపంతో ఆమె గొంతు నులమటంతో చనిపోయిందనట్లు వెల్లడించారు.

అచేతన స్థితిలోకి వెళ్లిన ఆమెను కారు వెనుక సీటులోకి ఎక్కించి అత్యాచారం చేసినట్లు ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. నిందితుడికి నేరచరిత్ర ఉన్నట్లు వెల్లడైంది. ఆయుధాల దొంగతనం కేసులో ఆరేళ్లు జైలుశిక్షను అనుభవించి రెండేళ్లు జైల్లో ఉన్నాడని.. ఏడాది క్రితం బెయిల్ పై బయటకు వచ్చారన్నారు. ఇలాంటి దుర్మార్గుడికి ఉరి విధించినా తక్కువే అవుతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News