ఎయిర్‌టెల్‌ ఖాతాదారులకు ఇంటర్నెట్‌ ఫ్రీ?!

Update: 2015-04-10 06:52 GMT
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ ఖాతాదారులను ఆకట్టుకోవడానికి కొత్తరకం ఎత్తుగడను వేస్తోంది. ఇంటర్నెట్‌ వినియోగం విషయంలో ఖాతాదారులకు సరికొత్త సౌకర్యాన్ని అందించే ప్లాన్‌ వేస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లో అప్లికేషన్‌ల రూపంలో సేవలను అందించే సర్వీసుల వారితో ఒప్పందాన్ని కుదుర్చుకొని ఆ అప్లికేషన్లను ఎయిర్‌టెల్‌ వినియోగదారులు ఉచితంగా వాడే ఏర్పాట్లు చేస్తోంది.

    ఫేస్‌బుక్‌, గూగుల్‌, వాట్సప్‌ వంటి యాప్‌ ఇంటర్నెట్‌ సర్వీసులతో ఎయిర్‌టెల్‌ ఒప్పందం చేసుకొనే ప్రయత్నాల్లో ఉంది. ఎయిర్‌టెల్‌కు ఆ సంస్థలతో ఒప్పందం కుదిరితే.. ఆ ఇంటర్నెట్‌ సర్వీసులను ఈ నెట్‌వర్క్‌ వినియోగదారులు ఉచితంగా వాడుకోవచ్చు!

    వాటిని బ్రౌజ్‌ చేస్తున్నప్పుడు ఎలాంటి చార్జీలూ పడవు! ఇంటర్నెట్‌ కోసం  ప్రత్యేకంగా డాటా కార్డులు వేయించుకోండా.. ఎలాంటి డబ్బు పే చేయకుండానే ఫేస్‌బుక్‌, గూగుల్‌, వాట్సప్‌లను ఉపయోగించుకోవడం సూపర్‌ ఆఫరే అవుతుందని చెప్పవచ్చు.

    మరి దీని వల్ల ఎయిర్‌టెల్‌కు నష్టం కదా.. అంటే, ఎలాంటి నష్టాలు లేకుండానే ఎయిర్‌టెల్‌ ఈ ఒప్పందాలను కుదుర్చుకొంటోంది. వినియోగదారులకు వాటి బ్రౌజింగ్‌ను ఫ్రీగా అందిస్తూ.. చార్జీలను ఫేస్‌బుక్‌, వాట్సప్‌, గూగుల్‌ లనుంచి వసూలు చేస్తుంది!

    ఇలా ఎయిర్‌టెల్‌ బయటపడుతుంది. మరి ఆ ఇంటర్నెట్‌ సర్వీసులు ఎందుకు ఆ భారాన్ని భరిస్తాయి అంటే.. వాళ్లకు వినియోగదారుల సంఖ్య పెరగడం, బ్రౌజింగ్‌ అవర్స్‌ పెరగడం ముఖ్యం! దాని కోసం వినియోగదారుల ఇంటర్నెట్‌ చార్జీలను ఆ కంపెనీలే భరించే అవకాశం ఉంది. కాబట్టి ఇది కచ్చితంగా వినియోగదారుడికి ఉపయోగపడే ప్లానే అవుతుంది. మరి ఇది ఈ ఆఫర్లు కేవలం ఎయిర్‌టెల్‌తోనే ఆగకపోవచ్చు. మిగతా కంపెనీలు కూడా ఈ విషయంలో పోటీకి రావొచ్చు!



Tags:    

Similar News