రోడ్డు మీద వ్యాపారం.. ఆదాయం ఎంతో తెలిసి షాక్ తిన్న ఐటీ అధికారులు!

Update: 2019-06-26 07:46 GMT
రోడ్డు ప‌క్క‌న వ్యాపారాల్నిచూసి చాలామంది లైట్ తీసుకుంటారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఉండే ఇలాంటి వ్యాపారాల్లోనూ ల‌క్ష‌లు.. కోట్లు సంపాదించేవాళ్లు చాలామంది ఉంటారు. ఇదే విష‌యాన్ని చెబితే ప‌లువురు న‌వ్వుతారు. వాద‌న‌కు దిగుతారు. పేదోళ్ల‌ను కూడా వ‌ద‌ల‌వా? అంటూ ఎక్క‌సాలు చేస్తారు. కానీ.. ఇలాంటి వారికి సంబంధించి అదిరిపోయే విష‌యాలు ఉన్నా ఇప్ప‌టివ‌ర‌కూ అవేమీ రికార్డు కాలేదు. తాజాగా ఆ లోటు తీర్చే ఉదంతం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో చోటు చేసుకుంది.

యూపీలోని అలీగ‌ఢ్‌లో ముకేశ్ క‌చోరీ దుకాణం చాలా ఫేమ‌స్‌. రోడ్డు ప‌క్క‌న జ‌రిగే ఈ వ్యాపారాన్ని చూసినోళ్లు ఎవ‌రూ అత‌గాడి సంపాద‌న‌ను ఒక ప‌ట్టాన అంచ‌నా వేయ‌లేరు. ఈ దుకాణంలో క‌చోరీలు తినేందుకు జ‌నం బారులు తీరుతుంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఆదాయ‌ప‌న్ను శాఖాధికారుల‌కు ఒక ఫిర్యాదు అందింది. భారీ ఎత్తున బిజినెస్ చేస్తున్నా ఎలాంటి ప‌న్నులు క‌ట్ట‌టం లేద‌న్న‌ది కంప్లైంట్ సారాంశం. అయితే.. ఇచ్చిన ఫిర్యాదు భారీ షోరూమ్ మీద ఇస్తే వెంట‌నే దాడులు చేసేవారు. కానీ.. వ‌చ్చిన కంప్లైంట్ ఒక సాదాసీదా క‌చోరీ బండి మీద కావ‌టంతో ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు గుట్టుగా మాటు వేశారు. రెక్కీ నిర్వ‌హించిన అస‌లు వ్యాపారం ఎంత జ‌రుగుతుంది?  అత‌గాడు ఎంత ప‌న్ను ఎగ్గొడుతున్న విష‌యాన్ని గుర్తించారు.

అత‌గాడి ఆదాయాన్ని అంచ‌నా వేసిన అధికారుల‌కు నోట మాట రాని ప‌రిస్థితి. ఎందుకంటే.. త‌క్కువ‌లో త‌క్కువ వేసుకుంటే అత‌గాడి ఆదాయం ఏడాదికి రూ.60 ల‌క్ష‌ల‌కు త‌గ్గ‌ద‌ని..కొన్ని సంద‌ర్భాల్లో కోటి రూపాయిల వ‌ర‌కూ వ‌చ్చిన ఆశ్చ‌ర్యం లేద‌న్న లెక్క‌లు వేశారు. దీంతో.. వెంట‌నే స‌ద‌రు వ్యాపారి ముకేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. నీ క‌చోరీ వ్యాపారాన్ని జీఎస్టీ కింద‌కు ఎందుకు తీసుకురాలేదు?  ఆదాయ‌ప‌న్ను ఎందుకు క‌ట్ట‌టం లేదంటూ ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు వేస్తున్నార‌ట‌.

దీనికి ఏమీ అర్థం కాని అత‌ను చెబుతున్న‌దేమంటే.. త‌నకు జీఎస్టీ.. ఐటీ లాంటివేమీ తెలీద‌ని.. ఇప్ప‌టివ‌ర‌కూ అలాంటి వాటిని క‌ట్టాల‌ని త‌న‌కు చెప్పినోళ్లు ఎవ‌రూ లేరంటూ అమాయ‌కంగా బ‌దులిస్తున్నార‌ట‌. దీంతో.. ఐటీ అధికారుల‌కు ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితి. దీంతో అత‌డికి నిబంధ‌న‌ల గురించి చెబితే.. తాను క‌డ‌తాన‌ని ఒప్పుకున్నాడ‌ట‌. దీంతో.. కావాల‌ని త‌ప్పు చేయ‌లేద‌ని గుర్తించిన జీఎస్టీ.. ఐటీ అధికారులు అత‌నికి ఏడాది కాలానికి ప‌న్ను చెల్లించాల‌ని చెప్పార‌ట‌. క‌చోరీల వ్యాపార‌మ‌ని త‌క్కువ‌గా చూడొద్ద‌న్న విష‌యం ఐటీ.. జీఎస్టీ శాఖ‌ల్లో ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి.. రానున్న రోజుల్లో ఈ త‌ర‌హా వ్యాపారారాల్ని  ఆయా ప్ర‌భుత్వ శాఖ‌లు ఎంత‌లా దృష్టి సారిస్తాయో చూడాలి.


Tags:    

Similar News