స్వాములోరి మీద పాలకులకు ఉండే అభిమానాన్ని.. ప్రేమ కు కోట్లాది రూపాయిల ప్రజల ఆస్తిని అధ్యాత్మిక గురువుల కు ధారాదత్తం చేయటం ఈ మధ్యన ఎక్కువైంది. తాజా గా తమ మీద కరుణా కటాక్షాల్ని కురిపించే విశాఖ శారదా పీఠం నిర్వహిస్తున్న స్వరూపానందేంద్రస్వామి వారికి 15 ఎకరాల భూమిని అప్పజెప్పేందుకు ఏపీ సర్కారు అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన ఫైల్ ను సిద్ధం చేయటమే కాదు.. గురువారం సదరు ఫైల్ మీద ఆమోద ముద్ర వేసేందుకు రంగం సిద్ధం చేసింది.
విశాఖ లోని చిన్న ముషిడివాడ లో కొలువు తీరిన ఈ ధార్మిక సంస్థ కు ఇప్పటికే భూమి ఉంది. ఆ మధ్యన తెలంగాణ లో ఈ ధార్మిక సంస్థ తెలంగాణ విభాగానికి రూ.12 కోట్ల విలువైన 2.34 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.2లకే కేటాయించటం తెలిసిందే. స్వాము లోరి మీద తనకున్న ఉదారత ను కోట్ల రూపాయిల భూమి ఇవ్వటం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ తన భక్తి ని చాటుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కే అంత అభిమానం ఉన్నప్పుడు.. ఏపీ సీఎం కు బాగా గురి ఉన్న ఆ స్వాము లోరికి అంతకు మించి అన్నట్లుగా ఉంటుంది కదా. తాజా గా శారదాపీఠానికి అవసరమైన భూమిని ఇచ్చేందుకు ఏపీ సర్కారు సిద్ధమవుతోంది. ఇందు కోసం 15 ఎకరాల్ని ఇచ్చేందుకు వీలుగా ఫైలును సిద్ధం చేశారు. విజయనగరం జిల్లా కొత్త వలస మండలం దెందేరు గ్రామ పరిధిలోని ఒక కొండ ప్రాంతంలోని భూమిని ఎంపిక చేశారు.
వేదన పాఠశాల నిర్వహణ ఆధ్యాత్మిక చర్యల్లో భాగంగా పేర్కొంటూ భూమి కోసం సదరు సంస్థ దరఖాస్తు చేసుకుంది. ఆశ్రమానికి సరిగ్గా పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భూమిని తమకు కేటాయించాలని స్వాము లోరు కోరుతున్నారు. అయితే.. ఈ భూమిలో 30 మంది రైతులు జీడిమామిడి తోటలు వేసుకొని జీవిస్తున్నారు. ఇటీవల ఈ భూముల పక్కనే గ్యాస్ పైప్ లైన్ వేశారు. పేరుకు విజయనగరం జిల్లా కిందకు వచ్చినా.. విశాఖ జిల్లా సరిహద్దుల్లో ఉండే ఈ విలువైన భూమిని ధార్మిక సంస్థకు ఇవ్వటం చర్చగా మారింది. మరి.. ఈ విలువైన భూమిని కారుచౌక ధరకు కట్టబెడతారా? లేదంటే ఉచితంగా ఇస్తారా? ఇంకేదైనా ప్రపోజల్ ఉందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. త్వరలోనే దీని పై క్లారిటీ వస్తుందన్న మాట వినిపిస్తోంది.