భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ అరెస్ట్ అవ్వడం సంచలనమైంది. అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. తన తోటి క్రికెటర్, టీమిండియా స్పిన్ బౌలర్ యజువేంద్ర చాహల్ ను ఉద్దేశించి చేసిన కొన్ని కామెంట్స్.. అతడి అరెస్ట్ కు కారణం అయ్యాయి. హర్యానాలోని హిసార్ జిల్లా హన్సి పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు మూడు గంటల పాటు విచారించారు. అనంతరం బెయిల్ పై విడుదల అయ్యాడు.
గత ఏడాది ఓ మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో సరదాగా నిర్వహించిన ఇంటర్వ్యూ సందర్భంగా యువరాజ్ సింగ్.. యజువేంద్రచాహల్ పై ఈ కామెంట్స్ చేశాడు. ఓ షెడ్యూల్ కులాన్ని కించపరిచేలా అతడు చేసిన వ్యాఖ్యానాలు ఉన్నాయంటూ అప్పట్లోనే దుమారం చెలరేగింది. హన్సీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. లాక్ డౌన్ సమయంలో యజువేంద్ర చాహల్ ఇంట్లో ఖాళీగా గడుపుతున్నాడని.. వీడియోలు షూట్ చేసుకుంటున్నాడని పేర్కొన్నారు.
ఓ కులానికి చెందిన మనుషుల్లా అతడికి పనీ పాట ఉండట్లేదని సరదాగా కామెంట్స్ చేశాడు. తమ కులాన్ని కించపరిచాడంటూ హిసార్ కు చెందిన ఓ న్యాయవాది యువరాజ్ సింగ్ పై కేసుపై హన్సి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీలోని 153, 153ఏ, 295, 505 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
దీంతో ఈ కేసులో యువరాజ్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. కోర్టులో ప్రవేశపెట్టారు. అతడికి వెంటనే బెయిల్ లభించింది. విచారణ ఎదుర్కొన్న తర్వాత యువరాజ్ విడుదలయ్యాడు. అనంతరం తన సోషల్ మీడియా అకౌంట్స్ మీద దీనికి సంబంధించిన కొన్ని వివరాలను పోస్ట్ చేశాడు యువరాజ్. తన స్నేహితులతో సరదాగా ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని.. ఉద్దేశపూర్వకంగా ఒకరిని కించపరచాలనే ఉద్దేశం తనది కాదని వివరణ ఇచ్చాడు. ఆ వ్యాఖ్యలు చేసినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాని తెలిపారు.