ఆడియో.. వీడియో క్లిప్పులతో రేగే దుమారం ఎంతలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో బయటకొచ్చిన ఒక ఆడియో క్లిప్ పెను దుమారాన్ని రేపటమే కాదు.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసింది. ఒకటిన్నర నిమిషాల నిడివి ఉన్న ఈ ఆడియో క్లిప్పు వెనుక భారీ కుట్ర ఉందన్న మాట కొందరి నోట వినిపిస్తుంటే.. అదేమీ లేదన్న మాటను మరికొందరు అంటున్నారు.
ఇంతకీ ఆ ఆడియో క్లిప్ ఏమిటి? అందులో ఏముంది? ఎవరెవరితో మాట్లాడారు? అసలు ఈ ఆడియో క్లిప్ ఎలా బయటకు వచ్చింది? ఇంతకీ ఆ ఆడియో క్లిప్ లో ఎంపీ బండి సంజయ్ మాట్లాడింది ఎవరితో? వారిప్పుడు ఏమంటున్నారు? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలెన్నో బయటకు వస్తున్నాయి.
గత ఏడాది ఇదే సమయానికి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగటం.. వాటి ఫలితాలు వెలువడటం తెలిసిందే. అంచనాలకు మించి మరీ వచ్చిన విజయంతో టీఆర్ఎస్ నేతలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. గత ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా గంగుల కమలాకర్. బీజేపీ అభ్యర్థిగా ఆయనపై బరిలోకి దిగారు బండి సంజయ్. వీరిద్దరి మధ్య పోటాపోటీగా సాగిన పోటీలో చివరకు గంగుల విజయం సాధించారు.
ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికల్లో ఓడిన అనంతరం బీజేపీ నేత బండి సంజయ్ జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ తో జరిపిన సంభాషణ బయటకు వచ్చింది. దాదాపు ఒకటిన్న నిమిషాల నిడివి ఉన్న ఆ ఆడియో క్లిప్ లో.. గంగుల కమలాకర్ నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేశారని.. ఇందుకు కలెక్టర్ సహకారం కావాలని కోరినట్లుగా ఉంది.
తెలుగులో స్పష్టత లేని రీతిలో కలెక్టర్ సర్పరాజ్ మాట్లాడిన మాటలు ఉంటే.. నాడు ఎన్నికల్లో ఓడిన సంజయ్ మాత్రం కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ కు కృతజ్ఞతలు తెలిపేందుకే ఎక్కువ సమయం కేటాయించినట్లుగా ఉంది. ఎన్నికల్లో ఖర్చు పరిమితిని గంగుల మించిపోయారని.. ఆయన ఖర్చు చేసిన వివరాలు.. దానికి సంబంధించిన పత్రాల మీదనే ఆ ఆడియో క్లిప్ లో ఉంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ క్లిప్ మీద బీజేపీ ఎంపీ బండి సంజయ్ రియాక్ట్ అవుతూ.. ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉందని.. తానేమీ మాట్లాడలేనని చెప్పారు. మరోవైపు గంగుల మాత్రం.. తనను దెబ్బ తీసేందుకు జరిపిన కుట్రకు నిదర్శనంగా సదరు ఆడియో క్లిప్ ఉందని ఆరోపిస్తున్నారు. ఈ ఆడియో ఉదంతాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు తీసుకెళతానని హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ వివాదంలో కీలకమైన కలెక్టర్ సర్పరాజ్ ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఈ మొత్తం ఆడియో క్లిప్ నిడివి ఎనిమిది నిమిషాలు ఉందని.. తన దగ్గర ఆ ఆడియో క్లిప్ మొత్తం ఉందన్నారు. తమకు అనుకూలంగా ఆడియోను కట్ చేసి ఇలా ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ ఆడియోక్లిప్ లో మీ ఫోన్ నెంబరును పంపిస్తే.. సేవ్ చేసుకుంటానని చెప్పిన వైనాన్ని ప్రస్తావిస్తూ.. తన దగ్గర బండి సంజయ్ నెంబరు లేదని.. అలాంటప్పుడు కుట్రలు ఎలా చేస్తానని ప్రశ్నిస్తున్నారు కలెక్టర్ సర్పరాజ్.
ఇంతకీ ఈ వివాదానికి కేంద్రమైన ఆడియో క్లిప్ ఎక్కడిది? అన్నది ప్రశ్నగా మారింది. ఆడియో క్లిప్ లో ఉన్న విషయాన్నే తీసుకుంటే బండి సంజయ్ ఫోన్ లో వాట్సాప్ కానీ.. వాయిస్ రికార్డర్ ఆప్షన్ కానీ లేనట్లే. ఇక.. కలెక్టర్ నుంచి ఆడియోక్లిప్ లీక్ అయ్యే వీల్లేదు. ఈ ఉదంతాన్ని మరింత నిశితంగా పరిశీలిస్తే.. మల్లికార్జున్ అనే వ్యక్తి (ఇతనో విలేకరని.. అతను పని చేస్తున్న పత్రిక ప్రస్తుతం మూతపడినట్లు చెబుతున్నారు) ఫోన్ నుంచి బండి సంజయ్ మాట్లాడారని.. ఆ సందర్భంగా రికార్డు చేసి.. క్లిప్ బయటకు వచ్చినట్లు భావిస్తున్నారు.
తాను బండి సంజయ్ తో మాట్లాడిన ఆడియో క్లిప్ మొత్తం 8 నిమిషాలని.. దాన్ని కట్ చేసి ఒకటిన్నర నిమిషంగా కట్ చేసినట్లు చెబుతున్నారు. తనకూ ఎనిమిది నిమిషాల క్లిప్ పంపారని కలెక్టర్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన వివరణలో పేర్కొనటం గమనార్హం. గంగుల చెబుతున్నట్లుగా.. తానీ ఆడియో క్లిప్ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళతానని చెప్పిన నేపథ్యంలో.. కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.