వైసీపీ నేత పీవీపీ బ్యాంకుకు బకాయిపడ్డ 148.90 కోట్లను రాబట్టుకునేందుకు ఆయన ఆస్తులను వేలం వేయడానికి కెనరా బ్యాంక్ రెడీ అయినట్లు సమాచారం. ఈ మేరకు తాజాగా బ్యాంక్ అధికారులు ప్రకటన విడుదల చేయడంతో పీవీపీ ఆస్తుల వేలం విషయం వెలుగులోకి వచ్చింది.
పొట్లూరి వరప్రసాద్ కు చెందిన కేపిటల్ లిమిటెడ్ సంస్థ భారీ మొత్తంలో రుణం తీసుకొని చెల్లించలేదని సమాచారం. ఈ మొత్తం బకాయిలు 148.90కోట్లకు చేరుకున్నాయట.. ఈ మేరకు ఇప్పటికే నోటీసులు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో తాజా కెనరా బ్యాంక్ పీవీపీ తాకట్టుపెట్టిన ఆస్తుల వేలానికి సిద్ధమైనట్టు తెలిసింది.
2003లో పీవీపీ కేపిటల్ సంస్థ.. కెనరా బ్యాంకు నుంచి పెద్దమొత్తంలో రుణం తీసుకుంది. ఆ సమయంలో పీవీపీతోపాటు ఆయన సతీమణి ఝాన్సీ సూరెడ్డి హామీదారులుగా సంతకం చేశారు. వీరిద్దరితోపాటు పీవీపీ వెంచర్స్ లిమిటెడ్ కూడా కార్పొరేట్ హామీదారుగా పూచీకత్తు ఇచ్చింది.
అయితే పీవీపీ కేపిటల్ సంస్థ రుణాన్ని చెల్లించడంలో విఫలమైనట్టు తెలిసింది. మొత్తం వడ్డీతో కలిపి కెనరాబ్యాంకుకు దాదాపు 148.90కోట్ల బకాయిలు పేరుకుపోయాయి.
దీంతో రుణాన్ని రికవరీ చేసుకునేందుకు తాజాగా కెనరా బ్యాంకు పూచీకత్తు పడ్డ చెన్నైలోని పీవీపీ వెంచర్స్ లిమిటెడ్ ఆస్తులను వేలం వేసేందుకు సిద్ధమైంది. చెన్నైలోని పెరంబూరు గ్రామంలో పీవీపీ వెంచర్స్ కు ఖాళీ భూమి ఉంది. దీన్ని వేలం వేసి రుణాన్ని రాబట్టుకోవడానికి బ్యాంక్ అధికారులు సిద్ధమైనట్టు సమాచారం. ఈ మేరకు ప్రకటన విడుదల చేయడంతో పీవీపీ ఆస్తుల వేలం విషయం వెలుగులోకి వచ్చింది.