పాండ్యాతో గొడవ కొంపముంచింది.. దీపక్​ హుడాపై వేటు..!

Update: 2021-01-24 02:30 GMT
దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్​ ముస్తాక్​ అలీ ట్రోఫీ ప్రారంభానికి ముందే రోడా టీమ్​ వైస్​ కెప్టెన్​ దీపక్​ హుడాపై వేటు పడింది. ఇటీవల రోడా టీం కెప్టెన్​ కృనాల్​ పాండ్యాతో గొడవపెట్టుకోవడం హుడా కొంపముంచింది.

దీపక్​ హుడాపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్టు బరోడా క్రికెట్ అసోషియేషన్ చైర్మన్​ సత్యజిత్​ గైక్వాడ్​ తెలిపారు.

దీపక్​ హుడా బరోడా జట్టుకు ప్రాతినిథ్యం వహించడని పేర్కొన్నారు. ఈ నిషేధం ఎంతకాలం ఉంటుందో వేచిచూడాలి.

అయితే అతడు 2021​-22 సీజన్లో ఆడే అవకాశం ఉందని సమాచారం.
జనవరి 10న ముస్తాక్​ అలీ ట్రోఫీ ప్రారంభమైంది.అయితే ఈ మ్యాచ్​కు ముందే బరోడా టీమ్​ కెప్టెన్​ కెప్టెన్​ కృనాల్​పాండ్యాతో దీపక్​ గొడవ పడ్డాడు. ఆ తర్వాత అసోసియేషన్​ అనుమతి లేకుండానే వెళ్లిపోయాడు.

అనంతరం బయట మీడియాతో కృనాల్​ పాండ్యాపై ఆరోపణలు చేశాడు
ప్రస్తుతం కరోనా నేపథ్యంలో బయో-బబుల్ వాతావరణంలో క్రికెట్​ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.కృనాల్ దూషించాడని, తన కెరీర్‌లో ఏ కెప్టెన్ నుంచి కూడా ఈ తరహా వేధింపులు ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈ ఘటనపై బరోడా క్రికెట్ అసోషియేషన్ పూర్తిస్థాయి విచారణ చేపట్టింది. అనంతరం హుడాపై చర్యలు తీసుకున్నది.
Tags:    

Similar News