మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడిగా ప్రాంరంభమై, మైక్రోసాఫ్ట్ కి సీఈవోగా ఎదిగి, ప్రపంచ కుబేరుడిగా తిరుగులేని స్థాయికి చేరుకొని , సంపాదించిన సొమ్ములో సగానికిపైగా సమాజానికి ఇచ్చేసి మహాదాతగా బిల్ గేట్స్ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే , ఈ మద్యే బిల్ గేట్స్ భార్యతో విడాకుల సందర్భంలో ఆయనలోని చీకటి కోణాలు కొన్ని ఇటీవల వెలుగులోకి రాగా, ఇప్పుడు మరో ఆశ్చర్యకరమైన సంగతి బయటపడింది. బిల్ గేట్స్ ఓ సీఈఓ గా మనందరికీ తెలుసు, కానీ గేట్స్ అమెరికాలో అతిపెద్ద రైతు. నమ్మడానికి కొంచెం కష్టమైనా కూడా నిజమే. అయితే , అయన నేరుగా పొలంలోకి దిగి వ్యవసాయం చేసిన సందర్భాలు చాలా తక్కువే అయినప్పటికీ, ఆయనకున్నంత సాగుభూమి అమెరికాలో ఇంకెవరికీ లేదు. బిల్ గేట్స్, అతని నుండి త్వరలోనే విడాకులు పొందనున్న భార్య మెలిండా గేట్స్ లకు అమెరికాలోని 18 రాష్ట్రాల్లో ఏకంగా 2,69,000 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి.
గేట్స్ అమెరికా అతిపెద్ద రైతులలో ఒకరు. బిల్ గేట్స్, అతని భార్య మెలిండా గేట్స్ 18 అమెరికన్ రాష్ట్రాలలో 2,69,000 ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. ల్యాండ్ రిపోర్ట్, ఎన్ బీసీ రిపోర్ట్ ప్రకారం.. గేట్స్ లూసియానా, నెబ్రాస్కా, జార్జియా ఇతర ప్రాంతాలలో వ్యవసాయ భూములను కలిగి ఉన్నారు. నార్త్ లూసియానాలోనే గేట్స్‌కు 70,000 ఎకరాల భూమి ఉందని, అక్కడ వారు సోయాబీన్స్, మొక్కజొన్న, పత్తి, బియ్యం పండిస్తున్నారు. అలాగే నెబ్రాస్కాలో ఉన్న 20,000 ఎకరాలలో అక్కడ రైతులు సోయాబీన్ పండిస్తున్నారని నివేదిక పేర్కొంది. ఇంకా జార్జియాలో ఉన్న 6000 ఎకరాలు, వాషింగ్టన్ లో ఉన్న 14,000 ఎకరాల వ్యవసాయ భూములలో బంగాళాదుంపలను పండిస్తున్నారు. అమెరికాకే చెందిన ప్రఖ్యాత ఫుడ్ కంపెనీ మెక్ డోనాల్డ్స్ ఎక్కువగా వాడేది బిల్ గేడ్స్ భూముల్లో పండిన ఆలుగడ్డలనే.
ఒకసారి గేట్స్ ను రెడ్ డిట్ లోని తన వ్యవసాయ భూముల గురించి మాట్లాడుతూ...ప్రస్తుత ప్రపంచంలో వ్యవసాయ రంగం చాలా ముఖ్యమైనది. ఎక్కువ మొత్తంలో పంటలు పండించడం ద్వారా అటవీ నిర్మూలనను నివారించవచ్చు. అలాగే ఆఫ్రికా వంటి దేశాలలో ఎదుర్కొంటున్న వాతావరణ ఇబ్బందులను, ఆహార సమస్యను ఎదుర్కోవటానికి ఇది సహాయపడుతుంది అని చెప్పారు.