గ్రేటర్ పోరు : బీజేపీ మేనిఫెస్టోలో జగన్ పథకం!

Update: 2020-11-27 17:30 GMT
గ్రేటర్ పోరు రసవత్తకరంగా సాగుతుంది. అన్ని పార్టీల నేతలు విమర్శలు , ఆరోపణలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా ఎంఐఎం , బీజేపీ , టిఆర్ ఎస్ మద్యే పోటీ ఉండబోతున్నట్టు కనిపిస్తుంది. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు పెద్దగా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే .. అన్ని పార్టీలు కూడా ఎన్నికల మేనిఫెస్టో ను విడుదల చేశాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో ఓ పథకం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో అమలు చేస్తున్న పథకాన్ని పోలి ఉంది.

జీహెచ్ఎంసీ ఎన్నికలకు బీజేపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్ల కోసం ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఆటోల రిపేర్లు, ఇతర అవసరాల కోసం ఆటో డ్రైవర్లకు ప్రతి సంవత్సరం రూ.7000 సాయం చేస్తామని ప్రకటించింది. అలాగే, ఆటో డ్రైవర్లకు ప్రమాదబీమా అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే, ఈ పథకం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోంది. వైఎస్ ఆర్ వాహనమిత్ర పేరుతో తీసుకొచ్చిన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు ప్రతి ఏటా రూ.10,000 సాయం అందిస్తున్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా వారికి చెల్లింపులు కూడా చేశారు. మొత్తం 2,62,493 మంది లబ్ధిదారులకు నేరుగా రూ.10 వేల చొప్పున ఆన్ ‌లైన్‌ చెల్లింపులు చేశారు.

కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబరు 17న జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు నోటిఫికేషన్ కూడా విడుదలైన విషయం తెలిసిందే. డిసెంబరు 1న పోలింగ్ జరుగుతుంది. 4న ఫలితాలను వెల్లిస్తారు. ఇక అవసరమైన ప్రాంతాల్లో డిసెంబరు 3న రిపోలింగ్ నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలను నిర్వహించనున్నారు.




Tags:    

Similar News