అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ మరో దుమారం

Update: 2020-12-06 08:15 GMT
కేంద్రంలోని బీజేపీ సర్కార్ కొద్ది నెలల కిందట తెచ్చిన జాతీయ పౌరసత్వ సవరణ చట్టం ( సీఏఏ) బిల్లు దేశవ్యాప్తంగా ఎంత హింసకు ఆందోళనలకు దారితీసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఢిల్లీలో అయితే మతకల్లోల్లాలో 50 మంది వరకు చనిపోయారు.

అయితే ఈ బిల్లుపై వెనక్కి తగ్గుందని అందరూ భావించగా బీజేపీ మరోసారి తెరమీదకు తెచ్చింది. అగ్నికి ఆజ్యం పోసింది. వచ్చే ఏడాది నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని బీజేపీ అమలు చేయడానికి రెడీ కావడం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.

2021 జనవరి నుంచి పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు  భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ  వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లో నివసిస్తోన్న శరణార్థులందరికీ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వాన్ని కల్పిస్తుందని స్పష్టం చేశారు. ఉత్తర 24 పరగణ జిల్లాలో నిర్వహించిన ఓ ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలను సంధించారు.

బంగ్లాదేశ్, పాకిస్తాన్, అప్ఘనిస్తాన్ నుంచి భారత్ కు వచ్చిన శరణార్థులను ఆదుకోవాలనే ఏకైక లక్ష్యంతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందని.. దాన్ని అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
Tags:    

Similar News