ప్రజల్లో ఆదరణ కోసం ఏపీ బీజేపీ ఎంత ప్రయత్నిస్తున్నా అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. కాస్తో..కూస్తో.. ప్రజల్లో మంచిపేరు తెద్దామనుకుంటున్న నాయకులకు కేంద్రం తీసుకుంటున్న షాకింగ్ నిర్ణయంతో తలెత్తుకోలేకపోతున్నారు. ఒక సమస్యను కప్పి పెట్టేందుకు ముందుగు సాగుతున్న ఏపీ బీజేపీకి కేంద్రం మరో సమస్యలను ముందుంచి వారి కాళ్లకు బంధం వేస్తోంది. తాజాగా విశాఖ ప్రైవేటీకరణ తో రాష్ట్ర బీజేపీ అడకత్తెరలో పోకచక్కలా మారింది.
ఒక పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే రాష్ట్రాల్లో తమ ఉనికిని చాటుకోవడానికి ఎన్నో వ్యూహాలు పన్నుతుంది. ఇప్పుడు సెంట్రల్లో ఫుల్ మెజారిటీతో ఉన్న బీజేపీ తన అధికార బలంలో కొన్ని కాంగ్రెస్ రాష్ట్రాలను చేజిక్కించుకుంది. అయితే ఏపీ విషయానికొచ్చేసరికి మాత్రం ఉల్టా ఫల్టాగా మారింది. ఇక్కడ అధికారంలోకి రావడానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే కనిపిస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి.
కేంద్రంలో అధికారంలో బీజేపీ ఏపీని పట్టించుకోవడం లేదు. కేంద్ర పెద్దలు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలతో రాష్ట్ర పార్టీకి తలనొప్పిగా మారింది. ఇప్పుడిప్పుడు కాస్తో..కూస్తో.. అన్నట్లుగా బీజేపీ ఫాంలోకి వస్తోంది. తమ బలం సరిపోదని జనసేనతో పొత్తు పెట్టుకున్న కమలం నాయకులు సెకండ్ ప్లేసు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ.. అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో తీసుకున్న నిర్ణయం శాపంగా మారింది.
పోలవరం ప్రాజెక్టు విషయంలో అధికారంలో ఉన్న వైసీపీ ఈ ప్రాజెక్టు మొత్తం కేంద్రానిదే బాధ్యత అన్నట్లుగా ప్రచారం చేస్తోంది. ఇది జాతీయ ప్రాజెక్టు అని బీజేపీయే ఈ ప్రాజెక్టును నిర్మించాల్సి ఉంటుందని అంటోంది. అయితే ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ ఎలాంటి కామెంట్ చేయని పరిస్థితి ఎదురైంది. ఇక అమరావతి విషయంలో నాన్చి.. నాన్చి.. చివరికి తమ మద్దతు ఉంటుందని చాలా లేట్ గా స్పందించారు.
తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో కార్మిక సంఘాలతో పాటు బీజేపీ మినహా రాజకీయ పార్టీలన్నీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. అయితే రాష్ట్ర బీజేపీ నాయకులంతా కేంద్రంలో కలిసి వినతి పత్రం సమర్పించినా పట్టించుకోలేదు. అంతేకాకుండా బీజేపీకి సపోర్టుగా ఉన్న జనసేన నాయకుడు సైతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిసి విశాఖ ఉక్కు విషయంలో మరోసారి ఆలోచించాలని కోరారు.
అయితే కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రజలను బీజేపీపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అంతర్వేది, అమరావతి విషయాలతో బీజేపీ తమ బలం పెరుగుతోందని మొన్నటి వరకు చెప్పుకొచ్చింది. కానీ విశాఖ స్టీల్ విషయంలో బీజేపీ ఎటువంటి కామెంట్ చేయకపోవడంతో ఆ పార్టీని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తిరుపతి ఉప ఎన్నికకు ఎలా వెళ్లాలి..? అని కమలం పార్టీ నాయకులు తర్జన భర్జన పడుతున్నారట. ఇప్పటికైనా కేంద్రం తన ప్రైవేటీకరణ విషయంలో నిర్ణయం మార్చుకుంటుందా..? చూడాలి..