ఫోటో షూట్ తో కేరళ సర్కారుకు షాకిచ్చిన పెళ్లికుమార్తె

Update: 2022-09-21 05:32 GMT
ఒక్క మాట అనలేదు. ఒక తప్పుడు చేష్ట చేయలేదు. సింఫుల్ గా.. ముగ్ధ మనోహరంగా అందంగా ముస్తాబై.. వావ్ ఎంత అందంగా ఉందన్న భావన కలిగేలా చేస్తూ.. ఒక పెళ్లి కుమార్తె చేసిన ఫోటో షూట్ కేరళ ప్రభుత్వానికి ఇప్పుడు తలనొప్పిగా మారటమే కాదు.. ఆమె ఇచ్చిన షాక్ తో పినరయి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.

ఇంతకూ ఆమె ఏం చేసింది? ఎందుకంత ఇబ్బంది? అంటే.. ఆమె ఫోటో షూట్ చేసింది.. రోడ్డు మీద. ఒకసాదాసీదా పెళ్లి కూతురు రోడ్డు మీద నాలుగు ఫోటోలు తీయించుకుంటే అంతలా ఇబ్బంది ఏముంటుంది? అన్న సందేహం రావొచ్చు.

కానీ.. అసలు విషయమంతా అక్కడే ఉంది. ఎర్ర చీర కట్టుకొని.. మెడలో బంగారు నగలు భారీగా వేసుకొని.. నడుముకు చిన్నపాటి వడ్డాణం పెట్టుకొని.. చేతలు నిండా గాజులు వేసుకొని.. చూసినంతనే పెళ్లి కుమార్తె అనిపించేలా ఉన్న ఆమె.. వీధిలో నడవటమే కేరళ సర్కారుకు సమస్యల్ని తెచ్చి పెట్టింది.

పట్టుబట్టలతో మెరిసిపోతున్న ఆమెకు భిన్నంగా.. రోడ్లు మొత్తం గోతులతో.. వర్షపు నీటితో నిండి.. నడవటానికి ఇబ్బందికరంగా ఉండటమే కాదు.. చూసినంతనే ఇంత దారుణంగా రోడ్లు ఉండటమా? అన్న భావన కలగేలా ఉన్న వైనం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.

నిజానికి ఈ పెళ్లి కుమార్తె లక్ష్యం కోసం.. దారుణంగా దెబ్బ తిన్న రోడ్లను ఎవరూ పట్టించుకోకపోవటం.. రోజువారీగా ఆ రోడ్డు నుంచి వెళ్లే వారికి ఎంతో ఇబ్బంది కలుగుతున్న వైనాన్ని ప్రభుత్వం వరకు తీసుకెళ్లేందుకు.. ఈ పెళ్లి కూతురు ఫోటో షూట్ ను రోడ్డు మీద చేయాలని డిసైడ్ అయ్యారు. తన ఫోటో షూట్ తో అయినా ప్రభుత్వం మనసు మారాలన్నది ఆ పెళ్లి కుమార్తె ఆలోచనగా భావిస్తున్నారు.

మొత్తమ్మీదా ఆ పెళ్లి కుమార్తె ఆలోచన వర్కువుట్ అయ్యింది. ప్రభుత్వం కన్ను పడిందని చెబుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఈ ఫోటో కమ్ వీడియో భారీ ఎత్తున వైరల్ గా మారింది. చాలా తక్కువ వ్యవధిలోనే లక్షలాది మంది వీడియోను.. ఫోటోను చూడటం.. కామెంట్లు రాస్తూ తమ మద్దతును ప్రకటిస్తున్నారు.

వైరల్ గా మారిన ఈ పెళ్లి కుమార్తె ఫోటో షూట్ లక్ష్యమైన.. సదరు రోడ్డు దుస్థితి మారితే.. ఆమె పడిన కష్టానికి ఫలితం దక్కుతుందన్న  మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది. కేరళ సర్కారు ఏం చేస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Full View
Tags:    

Similar News