ప్రేమ వ్యవహారం .. ఓ యువకుడి దారుణ హత్యకి కారణమైంది. తమ ఇంటి అమ్మాయిని ప్రేమించాడనే కోపంతో ఊగిపోయి , గొడ్డళ్లతో నరికి ముళ్లపొదల్లో పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే ..
కరీంనగర్ జిల్లాలో వీణవంక మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన యువకుడు ప్రణయ్ అదే గ్రామానికి చెందిన అమ్మాయి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారట, వారిద్దరి ప్రేమ వ్యవహారం నచ్చని అమ్మాయి కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారన్న ఆరోపణలు వస్తున్నాయి. రాత్రి మిత్రులతో కలిసి ఉన్న ప్రణయ్‌పై అర్థరాత్రి ఆయన ఇంటివద్దనే దుండగులు దాడి చేశారు. కొట్టుకుంటూ తీసుకెళ్లి అంబేద్కర్ భవన్ వద్ద నరికి చంపి సమీపంలోని ముళ్ల పొదల్లో పడేశారని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. స్థానికులు ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులకి సమాచారం అందించారు.
ఇక , ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే .. సంఘటన స్థలాన్ని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి సందర్శించి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నారు. దళితుడైన ప్రణయ్ అదే వర్గానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. ప్రేమ వ్యవహారంతోనే హత్య చేసినట్లు భావిస్తూ పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఈ సమయంలో తమ కుమారుడిని ప్రియురాలి కుటుంబ సభ్యులే హత్య చేశారని ప్రణయ్ తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆమె ఇంటిని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంట్లో రక్తపు మరకలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రియురాలి సోదరుడే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. హత్య జరిగిన ప్రాంతంలో పోలీసులు ఆధారాలు సేకరించారు.