కొత్త అవకాశాలను వాడటం కొందరికి భలే ఇష్టం. ఇళ్లను జాగ్రత్తగా జాకీలతో లేపి.. ఎత్తును సెట్ చేసే టెక్నాలజీ అక్కడక్కడా కొందరు వాడుతుంటారు. తాజాగా ఒక హైదరాబాదీ ఈ పని చేసి... చిక్కుల్లో పడ్డారు. బిల్డింగ్ లేపే ముందు దాని వయసు, దాని నాణ్యత... గురించి పట్టించుకోకపోవడంతో అసలుకే ఎసరు వచ్చింది. హైడ్రాలిక్ జాకీతో కిందకు ఉన్న ఇంటిని పైకిలేపే ప్రయత్నం వికటించి.. మొత్తానికే మునిగే షాకింగ్ ఉదంతం కుత్భుల్లాపూర్ సర్కిల్ పరిధిలో చోటు చేసుకుంది.
జీడిమెట్ల పరిధిలోని శ్రీనివాసనగర్ లో నాగేశ్వరరావు అనే వ్యక్తి 2001లో భవనాన్ని నిర్మించాడు. రోడ్డు వేయటంతో సదరు జీప్లస్ 2 భవనం రోడ్డుకు కిందకు వెళ్లిన పరిస్థితి. దీంతో.. అతను ఇబ్బందులకు గురవుతున్నాడు. వాస్తు పరంగా కూడా పలువురి చెప్పిన సూచనల్ని పరిగణలోకి తీసుకొని హైడ్రాలిక్ జాకీలతో ఇంటిని హైట్ తీసుకురావాలని నిర్ణయించాడు. శనివారం మధ్యాహ్నం హైడ్రాలిక్ మిషన్ తెప్పించాడు. ఇంటిని పైకి లేపించే ప్రయత్నం చేశాడు.
ఈ క్రమంలో బిల్డింగ్ 10 ఇంచులు వరకు పైకి లేపారు కానీ.. అనూహ్యంగా సదరు భవనం పక్కనే ఉన్న భవనం మీదకు ఒరిగింది. దీంతో.. పక్క ఇంట్లో ఉన్న వారు బయటకు పరుగులు తీశారు. పక్క భవన యజమాని జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇవ్వటంతో.. వారు రంగంలోకి దిగారు. అసలే వర్షాకాలం. ఇలాంటి వేళలో పైకి లేపిన భవనం.. దాని కారణంగా పక్కనే ఉన్న భవనం మీదకు ఒరిగిపోవటంతో ఏం చేయాలన్నది జీహెచ్ఎంసీ అధికారులకు సమస్యగా మారింది.
అధికారికంగా 2001లో నిర్మించినట్లుగా చెబుతున్నప్పటికీ సదరు భవనం 1990లోనే నిర్మించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. పాత భవనం కావటం.. కండీషన్ సరిగా లేకపోవటంతో భవనాన్ని కూల్చటం తప్పించి మరో మార్గం లేదంటున్నారు. ఇదంతా బాగానే ఉంది. సదరు భవనం దెబ్బకు పక్కనున్న భవనం మీదకు ఒరిగిపోయిన నేపథ్యంలో ఆ భవనం పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నగా మారింది. ఈ వ్యవహారం స్థానికంగా సంచనలంగా మారింది. కొండ నాలుకకు మందు వేస్తే.. ఉన్న నాలిక పోయిన చందంగా మారిందన్న మాట వినిపిస్తోంది.