ఆంధ్రప్రదేశ్...రాష్ట్ర విభజన తర్వాత లోటు బడ్జెట్ తో మొదలైంది. ఆ లోటు బడ్జెట్ తోనే గత ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం అలా నెట్టుకొస్తోంది. ఈ లోటు బడ్జెట్ తో ప్రభుత్వాన్ని నడిపించడానికి సరైన నిధులు లేక ఎదో ఒక విధంగా ముందుకు నడిపిస్తుంది. ఒకటో తేదీ జమ కావాల్సిన జీతాలు 5, 6 తేదీల్లో జమ అవుతున్నాయి. నిధుల కోసం ప్రభుత్వం ఆపసోపాలు పడుతుంటే, కొన్ని విషయాల్లో ప్రభుత్వం సొమ్ము దుబారా ఖర్చు అయిపోతుంది. అసలే అంతంత మాత్రం నిధులతో నెట్టుకొస్తున్న ప్రభుత్వ కార్యాలయాల్లో అనవసర ఖర్చు చేస్తున్నారు.
తాజాగా బయటకు వచ్చిన ఓ సంఘటన ప్రజలను, ప్రభుత్వ అధికారులకే దిమ్మ తిరిగేలా చేస్తుంది. ఆయుష్ విభాగంలో కార్ల నిర్వహణలో జరుగుతున్న దుబారా వెలుగులోకి వచ్చింది. 2006లో కొన్న క్వాలిస్ కారును ఇప్పటికీ వాడుతుండగా, ఆ కారును అమ్మితే ఇప్పుడు రూ.2 లక్షలు కూడా రావు. కానీ, దీనికి నలుగురు డ్రైవర్లు, వీరిలో ముగ్గురు ప్రభుత్వ డ్రైవర్లు ఉన్నారు. ఇక ఈ వాహనానికి నెలకు 200 లీటర్ల డీజిల్, మరమ్మతులకు నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేలు తదితరాలన్నీ కలిపి దాదాపు రూ.3 లక్షలవుతోంది. ఇక ప్రభుత్వ డ్రైవర్ల జీతం రూ.70 నుంచి రూ.80వేల మధ్య ఉంటుంది.
గతంలో రెండు కార్లుండగా వీటిలో ఓ కారు గ్యారేజికి చేరింది. ఇక ప్రస్తుతం ఉన్న నలుగురు డ్రైవర్లు ఒకే కారును నడుపుతున్నారు. ఒక్క కారు నడిపేందుకు నలుగురు డ్రైవర్లు అవసరం లేదన్నది అక్కడున్న అధికారులతోపాటు, కిందిస్థాయి సిబ్బందికి కూడా తెలుసు. కానీ, ఒక్క కారు కోసం నెలకు రూ.3 లక్షలు ఖర్చు చేస్తున్నారు. అంటే ఏడాదికి రూ. 36 లక్షలు ఇంత పెద్ద మొత్తంలో నిధులు దుబారా అవుతున్న దీనిని పట్టించుకునే నాధుడే కనిపించట్లేదు. డ్రైవర్లు అధికంగా ఉంటే కలెక్టర్ కు సరెండర్ చేస్తే అవసరమున్న చోట వినియోగించుకుంటారు. కానీ, అది సంబంధిత అధికారులు చేయాల్సిందే.