ముంబైలో వెలుగుచూసిన టీఆర్పీ స్కాంతో కొన్ని జాతీయ న్యూస్ చానెల్స్ ఫేక్ టీఆర్పీ కోసం అక్రమాలకు పాల్పడ్డట్టు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. మీటర్లు పెట్టి తమ చానెల్స్ చూసేలా జనాలకు డబ్బులు ఇచ్చి మరీ ఈ దందా చేసినట్టు ముంబై పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఇది దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఆ చానెళ్ల పరువు కూడా పోయింది. ఈ క్రమంలోనే బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) సంచలన నిర్ణయం తీసుకుంది.
హిందీ, ఇంగ్లీష్, ప్రాంతీయ న్యూస్ చానెల్స్ తోపాటు బిజినెస్ న్యూస్ చానెల్ వ్యూయర్ షిప్ రేటింగ్ ను ఎప్పటికప్పుడు విడుదల చేసే బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా న్యూస్ చానెల్ ల వ్యూయర్ షిప్ రేటింగ్ ను 12 వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. దీంతోపాటు వారం వారం విడుదల చేయాల్సిన న్యూస్ చానెల్ ల వ్యక్తిగత రేటింగ్ ను బార్క్ ప్రకటించడం లేదని తెలిపింది.
ప్రస్తుతం టెలివిజన్, న్యూస్ చానెల్ లో జరుగుతున్న సాంకేతిక లోపాల దృష్ట్యా బార్క్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
తాజాగా టీవీ ఛానళ్ల రేటింగ్ లపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది. ప్రసార భారతి సీఈవో వెంపటి శశిశేఖర్ ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు.
ఈ కమిటీ నేతృత్వంలో టీవీ చానెళ్లపై తుది నివేదిక వెల్లడైన తర్వాత రేటింగ్ లు పునరుద్దరించనున్నారు.