కొవిడ్ వ్యాక్సిన్ల పై కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో ప్రకటన జారీ చేసింది. కరోనా వ్యాప్తి కట్టడి చేసేందుకు కేంద్రం రెండు డోసుల టీకాలు అందిస్తోంది. పలు కంపెనీలకు చెందిన టీకాలను అందిస్తోంది. రాష్ట్రాలతో కలిసి ఉచితంగానే ఈ టీకాలను ఇస్తోంది. అయితే.. దశలు దశలు గా దాడి చేస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు... కేంద్రం ప్రికాషన్స్ డోసు ఇవ్వాలని కొన్ని రోజుల క్రితం నిర్ణయించింది.
ఆ నిర్ణయం మేరకు రెండో డోసు తీసుకున్న తర్వాత 9 నెలలు దాటిన తర్వాత ప్రికాషన్స్ డోసు ఇస్తోంది. కొన్ని రోజులుగా ప్రికాషన్స్ డోసు మధ్య కాల వ్యవధిని కేంద్ర ప్రభుత్వం తగ్గించిందని పలు వార్తా కథనాలు వచ్చాయి. దీనిపై మరోసారి కేంద్రం స్పష్టమైన ప్రకటన జారీ చేసింది. ప్రికాషన్స్ డోసు కు కాల వ్యవధి 9 నెలలే అని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా ఈ ఏడాది ప్రారంభంలో ప్రికాషన్స్ డోసు పంపిణీ ని కేంద్రం ప్రారంభించిన విషయం తెలిసిందే.
రెండో డోసు పంపిణీ ని ప్రారంభించిన నాటి నుండి 9 నెలల కాల వ్యవధి నిర్ణయించామని... ఇప్పటికీ అలాగే కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ కాల వ్యవధిని 6 నెలలకు తగ్గించాలంటూ గతంలో ప్రతిపాదనలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రికాషన్స్ డోసు కాల వ్యవధిని కేంద్రం తగ్గించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు తాజాగా స్పందించాయి. కాల వ్యవధిని తగ్గించ లేదని, రెండో డోసు తీసుకున్న 9 నెలల తర్వాతే ముందు జాగ్రత్త డోసు వేయించుకోవాలని మరోసారి స్పష్టం చేశాయి.
జనవరి 10 నుంచి దేశంలో మూడో డోసు పంపిణీ ప్రారంభమైంది. తొలి దశలో భాగంగా 60 ఏళ్ల వయస్సు పైబడిన వారికి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు అలాగే ఆరోగ్య కార్య కర్తలకు ప్రికాషన్స్ డోసు అందించారు. అయితే ఏప్రిల్ నెల 10వ తేదీ నుండి 18 ఏళ్ల పైబడిన అందరూ ప్రికాషన్స్ డోసు చేయించుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. కాగా.. ప్రైవేటు కేంద్రాల ద్వారా ఈ డోసును పంపిణీ చేస్తున్నారు.
కొవిషీల్డ్ ప్రికాషన్స్ డోసు ధరను రూ.600 నుంచి రూ. 225 కు తగ్గించారు. సీరం ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా ఈ మేరకు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. 18 ఏళ్లు నిండిన అందరికీ ప్రికాషన్స్ డోసు పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి అభినందిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.
ప్రికాషనరీ డోసు పై కేంద్రం చేసిన ప్రకటనను స్వాగతించిన అదార్ పూనావాలా, కొవిషీల్డ్ బూస్టర్ డోస్ ధర రూ.600గా పేర్కొన్నారు. పన్నులు అదనమని వెల్లడించారు. అయితే ఆస్పత్రులు, పంపిణీదారులకు బూస్టర్ డోస్ కొవిషీల్డ్ టీకాలపై భారీగా డిస్కౌంట్ ఇస్తామని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రికాషన్స్ డోసు ధరను రూ.600 నుంచి రూ.225కు తగ్గించారు. అయితే సర్వీస్ ఛార్జ్ గరిష్ఠంగా రూ.150 మాత్రమే ఉండాలని కేంద్రం శనివారం ప్రకటించింది.