చిక్కుల్లో మిస్ట‌ర్ కూల్.. కోర్టు నోటీసులు వెనుక‌!

Update: 2022-07-26 06:36 GMT
టీమిండియా క్రికెట్ మాజీ కెప్టెన్, మిస్ట‌ర్ కూల్ ఎంఎస్ ధోనికి ధోనీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అమ్రపాలి గ్రూప్ కేసులో ధోనీకి కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు సూచించిన మధ్యవర్తిత్వాన్ని కూడా నిలిపివేయాలని తెలిపింది. అమ్రపాలి హోమ్ బ‌య్య‌ర్స్ ప్రకారం ధోని రూ. 42 కోట్లు చెల్లించాలి. దీనిపై కొంతకాలంగా కేసు నడుస్తోంది.

ఈ వివాదం పూర్వాప‌రాల్లోకి వెళ్తే.. గతంలో ఆమ్రపాలి హోమ్ బ‌య్య‌ర్స్ కంపెనీకి ధోని బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశాడు. అంతేకాకుండా అందులో రెండు ఫ్లాట్లు తీసుకున్నాడు. ధోని ఈ సంస్థ‌కు ప్ర‌చారం చేయ‌డంతో ఎంతోమంది ఆక‌ర్షితులై ప్లాట్లు కొనుగోలు చేశారు. ఈ క్ర‌మంలో ఆమ్రపాలి హోమ్ బ‌య్య‌ర్స్ కంపెనీ రూ. 42 కోట్లను త‌మ‌కు ధోని ఎగ్గొట్టాడ‌ని ఆరోపిస్తూ 2019 మార్చిలో సుప్రీంకోర్టుని ఆశ్ర‌యించింది..

అయితే 2019 అక్టోబరులో ఆమ్రపాలి బ‌య్య‌ర్స్, ఎంఎస్ ధోని మధ్య ఉన్న ఆర్థిక వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా ప‌రిష్క‌రించ‌డానికి మాజీ న్యాయమూర్తిని మధ్యవర్తిగా హైకోర్ట్ నియమించింది. ఈ నేప‌థ్యంలో ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు సూచించిన మధ్యవర్తిత్వాన్ని నిలిపివేయాలని తాజాగా సుప్రీంకోర్టు జూలై 26న ఆదేశించింది.

ధోని బ్రాండ్ ను ప్రమోట్ చేస్తున్న రితి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్) తో ఆమ్ర‌పాలి గ్రూప్ ఒప్పందాలు కుదుర్చుకొని ఇళ్ల కొనుగోలుదారుల సొమ్మును అక్రమంగా మళ్ళించిందని సుప్రీంకోర్టు నియమించిన ఫోరెన్సిక్ ఆడిటర్లు ధర్మాసనానికి తెలిపారు.

ఈ నేప‌థ్యంలో ఆమ్రపాలి.. గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడాల్సి ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆమ్రపాలి గ్రూప్ పాత యాజమాన్యం మధ్యవర్తిత్వ ప్రక్రియలో గృహ కొనుగోలుదారులకు న్యాయం చేయాల‌ని సూచించింది. ఆమ్రపాలి, దాని డైరెక్టర్లకు నిరుపయోగంగా ఉన్న ఆస్తులను విక్రయించడం ద్వారా 700 కోట్ల రూపాయలను ఎలా సమకూర్చుకోవచ్చో అన్వేషించాలని నోయిడా, గ్రేటర్ నోయిడా అధికారులను ఆదేశించింది.
Tags:    

Similar News