ఆవుకు చికిత్స కోసం హెలికాఫ్టర్ తెప్పించారు!

Update: 2020-08-21 08:30 GMT
మానవత్వానికి ప్రతీకగా మనిషిని చెబుతుంటారు. ఇటీవల కాలంలో కొన్ని దారుణాలు చోటు చేసుకుంటున్నా.. ఇప్పటికి కోట్లాది మంది మానత్వంతో వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు చెప్పబోయే ఉదంతం ఈ కోవకు చెందిందే. చాలామంది తాము పెంచుకునే జంతువుల్ని తమ ఇంట్లోనివారిగా చూస్తుంటారు. చాలామంది కుక్కల్ని పెంచుకునే వారిని చూస్తే..వారింట్లో పిల్లలతో సమానంగా వాటిని పెంచుకోవటం.. పుట్టినరోజులు చేయటం లాంటివి చేస్తుంటారు.

తాజా ఉదంతానికి వస్తే.. స్విట్జర్లాండ్ కు చెందిన ఒక రైతు ఆవును పెంచుకుంటున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకునే ఈ ఆవు.. ఇటీవల అనారోగ్యానికి గురైంది. దీంతో.. దాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలంటే కష్టమవుతుందని భావించాడు. ఆసుపత్రికి నడిపించి తీసుకెళ్లకుండా ఉండేందుకు ఏకంగా హెలికాఫ్టర్ ను తెప్పించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

స్విట్జర్లాండ్ లోని ఆల్ప్స్ లోని ఒక పర్వత ప్రాంతంలో నివసించే రైతు.. తాను అల్లారు ముద్దుగా పెంచుకునే ఆవుకు జబ్బు చేయటంతో.. తీవ్రంగా కదిలిపోయాడు. సరిగా నడవలేక.. కుంటుతున్న వైనాన్ని గుర్తించాడు. అలానే నడిపిస్తే మరింత ఇబ్బందికి గురవుతుందని గుర్తించిన అతడు.. హెలికాఫ్టర్ తెప్పించి.. దాన్ని తాళ్లతో కట్టి.. వైద్యానికి తరలించారు. ఈ రైతు చేసిన ప్రయత్నాల్ని పలువురు అభినందిస్తున్నారు. మానవత్వానికి ప్రతీగా పలువురు అభివర్ణిస్తున్నారు.
Full View
Tags:    

Similar News