మ‌హిళ‌ల సెక్స్ కోరిక‌ల‌పై `పెంప‌కం` ప్ర‌భావం.. తాజా అధ్య‌య‌నంలో నిజాలు

Update: 2022-08-21 15:30 GMT
మ‌హిళ‌ల్లో సెక్స్ కోరిక‌లు రేకెత్త‌డానికి.. లేదా.. త‌గ్గిపోవ‌డానికి.. సంబంధించి ఇప్ప‌టికీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ఆడ‌వారిలో సెక్స్ ప‌ట్ల ఆస‌క్తి.. ఒక్కొక్క‌సారి ఒక్కొక్క విధంగా ఉంటుంద‌ని.. ఒక్కొక్క వ‌య‌సులో వారి స్పంద‌న‌లు ఒక్కొక్క విధంగా ఉంటాయ‌ని.. తెలుసు. అయితే.. ఇది జీన్స్‌పై ఆధార‌ప‌డి ఉంటాయ‌ని.. ఇన్నాళ్లుగా వ‌చ్చిన కొన్ని అధ్య‌య‌నాలు పేర్కొన్నాయి. అయితే.. తాజాగా ఓ అధ్య‌య‌నం.. మాత్రం అసలు ఆడ‌పిల్ల‌ల్లో సెక్స్ కోరిక‌లు అనేవి.. చిన్న‌ప్ప‌టి పెంప‌కం నుంచి ప్ర‌భావం చూపుతాయ‌ని అంటోంది.

వినేందుకు ఒకింత ఆస‌క్తిగా ఉన్న‌ప్ప‌టికీ.. వాస్త‌వ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అసలు విష‌యంలోకి వెళ్తే..  శృంగారంలో పాల్గొనాలనే కోరిక, ఆసక్తి పురుషులకు ఉన్నట్లుగానే మహిళలకు కూడా ఉంటుందా? లేక వారిలో సెక్స్ అంటే అసలు ఆసక్తి లేని వారు కూడా ఉంటారా?.. అనే సందేహం చాలా మందికి వస్తుంది. అయితే శృంగారం అంటే అసలు ఆసక్తి లేని మహిళలు కూడా ఉంటారని, దానికి పలు కారణాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇంట్లో వాళ్ల పెంపకం మహిళలకు సెక్స్పైన ఆసక్తి తగ్గేలా చేస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. "చిన్నప్పటి నుంచి సెక్స్ అంటే తప్పు.. స్త్రీలు శృంగారం పట్ల ఆసక్తి చూపించడం సరైన పద్ధతి కాదు, స్త్రీలు అలా ఉండకూడదు అనే ఒక భావజాలంతో వాళ్లను పెంచుతారు. పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కనాలి.. అంతే తప్ప సెక్స్ గురించి మాట్లాడటం వంటివి చేయకూడనే భావజాలానికి ప్రభావితమైన వారు శృంగారం పట్ల ఆసక్తి చూపించరు" అని నిపుణులు పేర్కొన్నారు.

శృంగారం పట్ల మహిళలకు ఆసక్తి లేకపోవడానికి మరో కారణం హైపోథైరాయిజం. థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉన్నా, ఈస్టర్న్ హార్మోన్స్ తక్కువ ఉన్నా కూడా సెక్స్పైన ఆసక్తి తగ్గుతుంది. పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ ఉన్న వారిలో యాండ్రోజెన్స్ ఎక్కువ పెరుగుతాయి. అంటే మగవాళ్ల హార్మోన్లు పెరుగుతాయి. రక్త హీనత, స్ట్రెస్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా సెక్స్పై ఆసక్తి తగ్గిపోతుంది. వైద్యులను సంప్రదించి సైకో థెరపీ చేయించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
Tags:    

Similar News