సీఎంపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం

Update: 2021-04-04 13:30 GMT
టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతవారం నందిగ్రామ్ లోని పోలింగ్ బూత్ లో పోలింగ్ కు అంతరాయం కలిగిందన్న మమతా బెనర్జీ ఆరోపణలను ఎన్నికల సంఘం కొట్టేసింది. మమతా బెనర్జీ ఫిర్యాదును తప్పుగా.. నిరాధారమైనదిగా ఎన్నికల సంఘం పేర్కొంది.

మమతా బెనర్జీ తప్పుడు ఆరోపణలపై ప్రవర్తనా నియమావళి, ప్రజల ప్రాతినిధ్య చట్టం సంబంధిత విభాగాల కింద చర్యలను పరిశీలిస్తున్నట్టు తెలిపింది.

కేంద్రహోంమంత్రి అమిత్ షా సూచన మేరకే కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్ లో 8 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తోందని.. రాష్ట్ర డీజీపీని మార్చిందని మమతా బెనర్జీ ఆరోపించిన సంగతి తెలిసిందే.

మమత ఆరోపణలను ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. నిరాధారమైన ఆరోపణలు చేసిన ఆమెపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఏప్రిల్ 1న ఎన్నికల సంఘంపై 63 ఫిర్యాదులు చేశారు మమతా బెనర్జీ. తమ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎన్నికల సంఘం ఘోరంగా విఫలమైందని మమత ఆరోపించారు. బీజేపీ నేతల దాడులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు.



Tags:    

Similar News