పెట్రోల్, డీజిల్ కార్ల వల్ల దేశంలో కాలుష్యం పెరిగిపోతోంది.ఇక ఈ శిలాజ ఇంధన వనరులు కూడా తరిగిపోతుంటాయి. అందుకే వీటికి ప్రత్యామ్మాయంగా కాలుష్య రహిత ఇంధనం కోసం అందరూ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయి.
ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ తోపాటు ఎలక్ట్రిక్ ఇంధనాలకు ప్రత్యామ్మాయంగా హైడ్రోజన్ ఇంధన వినియోగంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే భారత్ లో తొలి హైడ్రోజన్ కారు అందుబాటులోకి వచ్చింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ కారు పనితీరును కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేడు ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఆయన నివాసం నుంచి పార్లమెంట్ వరకూ హైడ్రోజన్ కారులో ప్రయాణించారు.
ఇప్పటికే పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యామ్మాయంగా హైడ్రోజన్ ఇంధన వాడకాన్ని కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేస్తోంది. ఇందులో భాగంగా దేశంలో తొలి హైడ్రోజన్ కారును కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గత నెలలోనే విడుదల చేశారు. సమర్థవంతమైన, పర్యావరణ రహిత, స్వయం ఆధారిత ఇంధన మార్గంలో భారత్ పయనించేందుకు ఈ గ్రీన్ హైడ్రోజన్ ఎంతగానో దోహదం చేస్తోందన్నారు.
జపాన్ సంస్థ టయోటా అందించిన ఈ కారును, పైలెట్ ప్రాజెక్ట్ కింద తానే మొదటగా వినియోగిస్తానని అప్పట్లో రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఆ ప్రకారమే ఢిల్లీ రోడ్లపై తొలి హైడ్రోజన్ కారులో కేంద్రమంత్రి ప్రయాణం చేశారు.
ఈ సందర్భంగా ట్విట్టర్ లో స్పందించిన గడ్కరీ.. 'భారత్ త్వరలోనే గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతి చేసే దేశంగా మారనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ దూరదృష్టి, క్లీన్ ఎనర్జీకి అనుగుణంగా నేషనల్ హైడ్రోజన్ మిషన్ కార్యక్రమం ద్వారా స్వచ్ఛమైన గ్రీన్ ఎనర్జీని అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గడ్కరీ తెలిపారు.
-హైడ్రోజన్ కారు ఫీచర్స్
భారత్ లో తొలి హైడ్రోజన్ కారును 'టయోటా' కంపెనీ తయారు చేసింది. దీని పేరును 'మిరాయ్'గా పెట్టింది. అధికపీడనం గల ట్యాంక్ లో హైడ్రోజన్ ను నిల్వ చేస్తారు. హైడోజ్రన్, ఆక్సిజన్ వాయువుల ప్రతి చర్య కారణంగా విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇందులో నీరు మాత్రమే బయటకు విడుదల అవుతుంది.కాలుష్యానికి ఆస్యారం ఉండదు. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 600 కి.మీలు వరకూ ప్రయాణించవచ్చు. కి.మీ ప్రయాణానికి కేవలం రూ.2 మాత్రమే ఖర్చు. ట్యాంకు నింపడం కూడా కేవలం రెండు, మూడు నిమిషాల్లోనే పని