సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వార్త వైరల్ అవుతుందో ఎవరికీ తెలియదు. కనీసం ఎందుకు అవుతుందో అంతకంటే అర్థంకాదు. ఓ వైపు ఫేక్ న్యూస్ను ఎక్కువగా స్ప్రెడ్ చేయకండి అని చాలా సార్లు మనమే.. ఓ మెసేజ్ను ఫార్వడ్ చేస్తుంటాం. మనం పంపిన వార్త సరైనదే అయితే ఫర్వాలేదు. కానీ ఇతరులను ఇబ్బంది పెట్టేది అయితేనే అసలు సమస్య. ఇలాంటి వార్తనే ఒకటి మార్కెట్లో ఓ... అని తెగ చక్కర్లు కొడుతుంది. దీనిని చూసిన నెటిజన్లు కూడా క్షణం కూడా ఆలోచించకుండా.. వచ్చిన మరో క్షణమే ఫార్వర్డ్ చేస్తున్నారు. దీంతో అది చూసిన వారు చాలా మంది భయబ్రాంతులక గురౌవుతున్నారు. ఇంతకీ ఆ మెసేజ్ ఏంటి? అందులో భయపడేంతలా ఏముంది? నిజమేంత? ఆఫ్రికాన్ దేశమైన సోమాలియా నుంచి భారత్కు కొన్ని వందల టన్నుల్లో అరటిపండ్లు దిగుమతి అయ్యాయి.
ఇవి ఇప్పుడు బహిరంగ మార్కెట్లోకి వచ్చేశాయి. వాటిలో హెలికోబాక్టర్ అనే బద్ద పురుగును పోలినటువంటి క్రమి ఒకటి ఉంది. ఆ అరటి పండను తీసుకుంటే.. అది మానవుని శరీరంలోకి మనకు తెలియకుండానే వెళ్లిపోతుంది. అక్కడ ఉండే శరీరంలోకి విషపూరితమైన ద్రవాన్ని విడుదల చేస్తుంది. దీంతో తిన్న వారికి మోషన్స్, వాంతింగ్స్, హెడేక్, ఆయాసం, ఊపిరాడకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. ఇది అంతా కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే జరుగుతుంది. సరిగ్గా 12 గంటల్లో తిన్న వ్యక్తి మరణిస్తారు అని ఓ వీడియోతో పాటు ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతుంది. దీనిని నిజం చేసేలా వీడియోలో అరటి పండు తొక్క తీసి మధ్యకు విరిచి చూస్తే అందులో బద్దపురుగు లాంటివి రెండు ప్రత్యక్షం అవుతున్నాయి. దీంతో ఇది చూసిన వారు మార్కెట్లో అమ్మే అరటి పండ్ల జోలికి పోవాలంటేనే ఆలోచిస్తున్నారు. మరోవైపు ఇది నిజమా? లేక రెగ్యులర్గా వచ్చే ఫార్వర్డ్ మెసేజ్ లాంటిదేనా అనేది కూడా తెలియక గగ్గోలు పెడుతున్నారు.
అయితే తాజాగా ఈ వీడియోకు సంబంధించి వస్తున్న వార్తలపై భారత ఆహార భద్రత- ప్రమాణాల సంస్థ స్పందించింది. వాట్సాప్లో వస్తున్న వీడియోలో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఇది కేవలం ఎవరో కావాలని చేసిన బూటకపు పని అని పేర్కొంది. వైరల్ అవుతున్న ఆ వీడియోను అసలు మన దేశానికి చెందింది కాదని చెప్పింది. వాస్తవానికి అందులో పేర్కొన్నట్లు హెలికోబాక్టర్ అనేది బ్యాక్టీరియా అని వివరణ ఇచ్చింది. ఇందుకు సంబంధించి మరో చిన్న లాజిక్ను కూడా ఆ సంస్థ ప్రతినిధులు ఎత్తి చూపించారు. అంతర్జాతీయ సంస్థలైనా ఐరాస లెక్కల ప్రకారం.. మిగతా అన్నీ దేశాల కంటే భారత్లో అరటి సాగు ఎక్కువగా ఉందని చెప్పారు. కరవు, ఆకలి చావులతో ఉండే సోమాలియా నుంచి అరటి పండ్లను భారత్ దిగుమతి చేసుకునే అంత దౌర్భాగ్య స్థితిలో లేదని పేర్కొన్నారు.
ఈ వీడియోపై మరో దేశం కూడా స్పందించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో కూడా ఇదే వీడియో వైరల్ అవుతుందని అక్కడి అధికారులు పేర్కొన్నారు. స్థానికంగా ఉండే ఆహార భద్రత సంస్థ అధికారులు దానిని పరిశీలించినట్లు చెప్పారు. అందులో పేర్కొన్నట్లుగా అరటి పండ్లు దిగుమతి చేసుకోలేదని స్పష్టం చేశారు. ఈ వీడియో ఇప్పటికే అంతర్జాతీయంగా ఉండే పలు భాషల్లో డబ్ అయ్యి వైరల్గా మారినట్లు గుర్తించారు.