జగన్​ సంచలన నిర్ణయం..పేదలకు మరింత చేరువగా వైద్యం..!

Update: 2020-11-25 11:10 GMT
ఏపీ సీఎం జగన్​మోహన్​రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే విద్యారంగంలో పెనుమార్పులు తీసుకొచ్చిన జగన్​.. ఈ సారి వైద్యంపై దృష్టిపెట్టారు. పేదలకు వైద్యానికి మరింత చేరువ చేసేందుకు త్వరలో ఏపీలోని ప్రధాన నగరాల్లో అర్బన్​ క్లినిక్​లు తెరవబోతున్నారు. ఇప్పటికే ఏపీలో దయనీయంగా ఉన్న ప్రభుత్వ బడుల రూపురేఖలు మర్చేశారు. ‘నాడు నేడు’ కార్యక్రమంతో చాలా పట్టణాలు, పల్లెల్లో స్కూళ్ల రూపురేఖలు మారాయి. కార్పొరేట్​ను తలదన్నేలా స్కూళ్లను అభివృద్ది చేశారు. విద్యారంగంలో పెనుమార్పులు తీసుకొచ్చిన జగన్​.. ఇప్పడు వైద్య రంగాన్ని ప్రక్షాళన చేయబోతున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​కు ఎంతో పేరు తీసుకొచ్చిన అర్బన్​ క్లినిక్​లను త్వరలో ఏపీ వ్యాప్తంగా తీసుకురానున్నారు.

త్వరలో అర్బన్​ హాస్పిటల్స్​ను తీసుకొస్తానని ఇప్పటికే సీఎం జగన్​మోహన్​రెడ్డి ప్రకటించారు. తాజాగా ఇందుకు సంబంధించి ప్రభుత్వం ముందడుగు వేసింది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 560 వైఎస్సార్ అర్బన్ క్లినిక్‌లకు ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం అనుమతులు కూడా మంజూరు చేశారు. తొలిదశలో 355 కొత్త భవనాలను నిర్మించనున్నారు. మరో 205 భవనాలకు మరమ్మతులు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. వీటి నిర్మాణం కోసం జాతీయ ఆరోగ్య మిషన్, రాష్ట్ర ఆరోగ్యశాఖ నుంచి నిధులు రానున్నాయి. ఢిల్లీలోని కేజ్రీవాల్​ ప్రభుత్వం మొహల్లా క్లినిక్ లు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా పేదప్రజలకు ఉచితంగా వైద్యం అందుతున్నది. ఇక్కడ డాక్టర్​ ఫీజులు ఉండవు. వైద్య అన్నిరకాల వైద్య పరీక్షలు ఉచితం, మందులు కూడా ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేస్తుంది.

అయితే ఇదే తరహాలో ఏపీలో కూడా వైద్యసేవలు అందించనున్నట్టు సమాచారం.ఇందుకోసం ముందుగా పట్టణాల్లో క్లినిక్​లు తెరవనున్నారు. అక్కడ సక్సెస్​ అయితే ఈ సేవలు పల్లెలకు కూడా విస్తరిస్తారు. ఇప్పటికే చాలా మారుమూల పల్లెల్లో వైద్యం అందడం లేదు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. తెలంగాణలోని హైదరాబాద్​లో కూడా బస్తీ దవాఖానలు ఇదే తరహాలో పనిచేస్తున్నాయి.
Tags:    

Similar News