డ్రాగన్​ఫ్రూట్​.. కమలం ఫ్రూట్​ వివాదం సరే.. ! అసలు ఈ పండు చరిత్ర ఏమిటి?

Update: 2021-01-28 02:30 GMT
గుజరాత్​ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంతో ఇటీవల డ్రాగన్​ఫ్రూట్​ వార్తల్లోకి నిలిచింది. డ్రాగన్​ ఫ్రూట్​ పేరును గుజరాత్​ సర్కార్​ ‘కమలం’ ఫ్రూట్​గా మార్చింది. బీజేపీ ఎన్నికల గుర్తు కూడా కమలం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో గుజరాత్​ ప్రభుత్వం పై విమర్శలు వచ్చాయి. అయితే తాము రాజకీయం కోసం ఈ నిర్ణయం తీసుకోలేదని.. డ్రాగన్​ ఫ్రూట్​కు మరింత ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు.. రైతులకు మేలు చేసేందుకే తాము పేరు మార్చామని గుజరాత్​ ముఖ్యమంత్రి విజయ్​రూపాని చెబుతున్నారు. అయితే ఈ పండు చూడటానికి కమలం ఆకారంలో ఉంటుందని అందుకే దీనిపేరు కమలంగా మార్చినట్టు గుజరాత్​ ప్రభుత్వం చెబుతున్నది.

ఈ నేపథ్యంలో అసలు ఈ డ్రాగన్​ ఫ్రూట్​ను ఎక్కడ పండిస్తున్నారు.. వీటి పెంపకంతో రైతులు ఏమేరకు లాభాలు పొందుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
మనదేశంలోని సౌరాష్ట్ర, గుజరాత్​లోని కొన్నిప్రాంతాల్లో రైతులు ఈ డ్రాగన్​ ఫ్రూట్​ను పండిస్తున్నారు. అయితే ఈ పండు రోగనిరోధకశక్తిని పెంచుతుందని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో కరోనా టైంలో దీనికి విపరీతమైన డిమాండ్​ పెరిగింది. మరోవైపు డెంగ్యూ పేషెంట్లకు కూడా డాక్టర్లు ఈ పండును సిఫారసు చేస్తారు. దీంతో రైతులు ఈ మొక్కలను సాగుచేస్తున్నారు.
సౌరాష్ట్రలోని పలువురు రైతులు ఈ డ్రాగన్​ ఫ్రూట్​ను సాగుచేస్తున్నారు.
వీటికి పెట్టుబడి ఎక్కువే.. ఆదాయం కూడా బాగానే వస్తుందని రైతులు అంటున్నారు.

ఒక్కోచెట్టు సుమారు 15 నుంచి 20 కిలోల కాయలు కాస్తుందని అన్నదాతలు అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్​లో ఈ పండ్లు కిలో 250 నుంచి 300 పలుకుతున్నాయి. సీజన్లో కూడా రూ. 150 నుంచి రూ. 400 పలుకుతుందని రైతులు అంటున్నారు. అయితే అందరు రైతులు భారీ ఎత్తున ఈ పంటను సాగుచేస్తే ధర పడిపోయే అవకాశం కూడా ఉన్నది.
అయితే ఈ పంటకు చీడపీడల సమస్య చాలా తక్కువ అని రైతులు అంటున్నారు. కేవలం మొక్కలు నాటినప్పుడు మాత్రమే ఖర్చు అవుతుందని.. ఆ తర్వాత నీటిపారుదల అవకాశం ఉంటే వీటి సాగు లాభదాయకమేనని రైతులు చెబుతున్నారు.
అయితే డ్రాగన్ ఫ్రూట్ పెట్టుబడి పెట్టాక మూడేళ్ల వరకు దిగుబడి రాదు.. ఆ తర్వాతే మనకు ఆదాయం వస్తుంది.
ఇటీవల ఈ పండ్లనుంచి జామ్, జెల్లీ తయారుచేస్తున్నారు. అందువల్ల గిరాకీ పెరిగిందని రైతులు అంటున్నారు.


రక్తంలో హిమోగ్లోబిన్​ పెంచేందుకు సీ విటమిన్​ కోసం డ్రాగన్​ ఫ్రూట్​ తీసుకొవచ్చని డాక్టర్లు, శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ పండ్లకు డిమాండ్​ పెరిగింది.
డ్రాగన్​ ఫ్రూట్​ మొక్క.. ముళ్లజెముడు (కాక్టస్) జాతికి చెందినది. మధ్య అమెరికా, దక్షిణ అమెరికా అడవుల్లో పుట్టిందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
లాటిన్ అమెరికాలో ఈ పండును 'పితాయ' లేదా 'పితాహాయ' అని కూడా పిలుస్తారు.
లాటిన్ అమెరికానుంచీ వచ్చిన ఈ పండ్లను ఆగ్నేయాసియా దేశాలైనా థాయ్‌లాండ్, వియత్నాంలలో చాలాకాలంగా పెంచుతున్నారు.
అయితే ఈ పండుకు పేరు మార్చడం వల్ల తమకు ఏ ఉపయోగం లేదని.. తోటల పెంపకానికి ప్రభుత్వం సహకరించాలని రైతులు కోరుతున్నారు.


Tags:    

Similar News