తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆరోగ్య పరిస్థితిపై సమాచారం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ విచారణను చేపట్టలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి రాజకీయ జిమ్మిక్కులు కోర్టుల ముందు ఆడితే మౌనంగా చూస్తూ ఊరుకోమని పిటిషనర్‌ను హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది.
సీఎం ప్రజల దృష్టిలో లేకుంటే పిటిషనర్ హేబియాస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేయాలని సూచించింది. పిటిషనర్ కోరినట్లు అత్యవసర ప్రాతిపదికన పిటిషన్ విచారణను చేపట్టలేమని కోర్టు స్పష్టం చేసింది.
తీన్మార్ మల్లన్నగా ప్రసిద్ది చెందిన నవీన్ కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ మీడియా ముఖంగా కనిపించడం లేదని.. ఆయన ఆరోగ్యం గురించి సమాచారం కోరుతూ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్‌లో సిఎం కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి పలు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయని.. ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని పిటీషన్ లో వాదించారు. ఈ నేపథ్యంలో కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ప్రజలకు తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన హైకోర్టును కోరారు. కానీ హైకోర్టులో తీన్మార్ మల్లన్నకు గట్టి హెచ్చరిక తగిలింది.
ఈ పిటిషన్ తరువాత, టీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ కనిపించకపోతే సమస్య ఏమిటి అని నిలదీశారు.