ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా పాదయాత్ర చేసేందుకు సిద్ధమైన బండి సంజయ్ కు లైన్ క్లియర్ అయ్యింది. పోలీసుల అభ్యంతరాల నేపథ్యంలో ఆయన చేపట్టాల్సిన తదుపరి పాదయాత్ర నిలిచిపోతుందన్న ఆలోచనలో ఉన్న దానికి భిన్నంగా తాజాగా తెలంగాణ హైకోర్టు అనుమతులు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
అయితే.. ఇందుకోసం కొన్ని పరిమితుల్ని నిర్దేశించింది. న్యాయంగా తాము చేస్తున్న పాదయాత్రను అడ్డుకోవాలని ప్రయత్నించిన తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలినట్లైందన్న మాట బీజేపీ నేతల నోటి నుంచి వినిపిస్తోంది.
విడతల వారీగా పాదయాత్రను చేస్తున్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా తన ఐదో పాదయాత్రను చేపట్టేందుకు సిద్ధం కావటం.. అందుకు పోలీసులు అభ్యంతరం తెలుపుతూ అడ్డు పెట్టటం తెలిసిందే. బండి పాదయాత్ర జరిపితే శాంతిభద్రత సమస్యలు చోటు చేసుకుంటాయని పోలీసులు అభ్యంతరం చెబుతూ..
పాదయాత్ర చేసేందుకు సిద్ధమై వెళుతున్న బండిని అడ్డుకోవటం తెలిసిందే. ఈ నేపథ్యంలో లంచ్ మోషన్ పిటిషన్ ను ఈ రోజు (సోమవారం) హైకోర్టులో దాఖలు చేశారు. దీనిపై ఇరువర్గాల మధ్యన పెద్ద ఎత్తున వాదనలు చోటు చేసుకున్నాయి.
బైంసా పట్టణంలోకి వెళ్లకుండా బయట నుంచి పాదయాత్ర జరుపుకోవాలని పేర్కొన్న హైకోర్టు అందుకు పలు పరిమితుల్ని పేర్కొంది. బహిరంగ సభను బైంసా పట్టణంలో నిర్వహించటానికివీల్లేదని చెప్పిన కోర్టు.. బైంసాకు మూడు కిలోమీటర్ల దూరంలోనే సభను నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. అంతేకాదు.. పాదయాత్రలో భాగంగా బైంసాలోకి వెళ్లకూడదని పేర్కొంది. విచారణలో భాగంగా బీజేపీ తరపు న్యాయవాది రామచందర్ రావు తన వాదనలు వినిపిస్తూ బైంసాలోకి పాదయాత్ర వెళ్లదన్నారు.
దీంతో స్పందించిన హైకోర్టు.. బైంసాలోకి పాదయాత్ర వెళ్లకుంటే పోలీసులకు అభ్యంతరం ఏమిటని ప్రశ్నించింది. పాదయాత్రలు రాజకీయ పార్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కుగా హైకోర్టు పేర్కొంది. దీంతో.. పాదయాత్రకు హైకోర్టు అనుమతి లభించటంతో బీజేపీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసుల్ని ప్రయోగించిందన్న ఆరోపణలు చేయటం తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.