బెడ్రూంలో స‌త్తా లెక్కేసే ప‌రిక‌రం వ‌చ్చేసింది

Update: 2017-12-02 05:24 GMT
టెక్నాల‌జీ ఎంత‌గా విస్త‌రిస్తుందో తెలిసిందే. డిజిట‌ల్ యుగంలో టెక్నాల‌జీకి అసాధ్య‌మైన‌దంటూ ఏమీ లేనిదిగా మారుతోంది. ఇప్ప‌టికే శ‌రీరంలోని ప‌లు అంగాల ప‌ని తీరును విశ్లేషించే ప‌రిక‌రాలు ఉన్న‌ప్పుడు.. బెడ్రూంలో స‌త్తా తేల్చే ప‌రిక‌రాన్ని ఎందుకు త‌యారు చేయ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న వ‌చ్చిన‌ట్లుంది. ఇంకేముంది.. ఆల‌స్యం చేయ‌కుండా ఆ దిశ‌గా దృష్టి సారించారు శాస్త్ర‌వేత్త‌లు.

ఒక్క‌సారి క‌న్ను వేయాలే కానీ సాధ్యం కానిది ఏమీ ఉండ‌దు క‌దా. బెడ్రూం స‌త్తా లెక్క క‌ట్టే విషయంలోనూ ఇదే జ‌రిగింది. ప‌డ‌క గ‌దిలో మ‌గాళ్ల సామ‌ర్థ్యాన్ని లెక్కించే ప‌రిక‌రం ఇప్పుడు అందుబాటులోకి వ‌చ్చేసింది. దీన్నికండోమ్‌ గా చెప్ప‌లేం కానీ.. దీన్నో సెక్స్ టాయ్ గా అభివ‌ర్ణించొచ్చు. బెడ్రూంలో సెక్స్ చేసే స‌మ‌యంలో కండోమ్ తో పాటు.. ఐకాన్‌ గా పిలిచే ఈ సెక్స్ టాయ్‌ ను పెట్టుకుంటే.. మీ సామ‌ర్థ్యం ఎంత‌న్న విష‌యాన్ని లెక్కేసి మ‌రీ చెబుతుంది.

అంతేకాదు.. రొమాంటిక్ క్ష‌ణాల్లో మీరెన్ని క్యాల‌రీలు ఖ‌ర్చు పెట్టారో లెక్క చెప్ప‌టంతో పాటు.. లైంగికంగా ఏదైనా వ్యాధుల్ని సంక్ర‌మించే అవ‌కాశాల్ని గుర్తించి వెంట‌నే అలెర్ట్ చేస్తుంది.

దీని గురించి మొత్తం విన్న‌ప్పుడు.. లైంగిక వ్యాధుల‌కు చెక్ పెట్టేందుకు వీలుగా దీన్ని రూపొందించి ఉంటారు. కానీ..అంద‌రి క‌న్ను ప‌డేలా చేసుకోవాలంటూ అంద‌రిని ఆక‌ర్షించే అంశాన్ని ప్ర‌ముఖంగా  ప్ర‌స్తావించార‌ని చెప్పాలి.  ఈ సెక్స్ ప‌రిక‌రాన్ని బ్రిట‌న్‌ కు చెందిన కంపెనీ ఒక‌టి త‌యారు చేసింది. ఐకాన్ ప‌రిక‌రాన్ని మొబైల్ ఫోన్ తో అనుసంధానం చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

దీని ద్వారా సెక్స్ సామ‌ర్థ్యానికి సంబంధించిన లెక్క‌ల‌న్నీ మొబైల్ ఫోన్లో ఆవిష్కృతం కానున్నాయి. మ‌రింత ప్రైవేటు విష‌యాలు బ‌య‌ట‌కు పొక్క‌కుండా చాలా ర‌హ‌స్యంగా ఉంచుతుంద‌ని చెబుత‌న్నారు. అవ‌స‌ర‌మైతే త‌మ బెడ్రూం సామ‌ర్థ్యానికి సంబంధించిన లెక్క‌ల్ని షేర్ చేసుకునే వెసులుబాటు కూడా ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇంత‌కూ ఈ ప‌రిక‌రం రేటు ఎంత‌న్న‌ది యూస్తే.. రూ.5200 గా చెబుతున్నారు.  మార్కెట్లోకి కొత్త‌గా వ‌చ్చిన ఐకాన్ కోసం ఇప్ప‌టికే 90వేల మంది ఆర్డ‌ర్ బుక్ చేశార‌ట‌. ఈ ప‌రిక‌రం ముచ్చ‌ట ఏమో కానీ రానున్న రోజుల్లో బెడ్రూం సామ‌ర్థ్యం లెక్క అంకెల రూపంలో బ‌య‌ట‌ప‌డే నేప‌థ్యంలో కొత్త దిగులు వెంటాడి వేధించ‌ట‌మే కాదు.. దాన్ని అధిగ‌మించేందుకు మ‌రికొన్ని వ్యాపారాలు పుట్టుకురావ‌టం ఖాయం.
Tags:    

Similar News