సంజ‌య్ జైన్ ... 42 చోట్ల సోదాలు,‌ 62 కోట్లు సీజ్!

Update: 2020-10-28 14:10 GMT
ఎంట్రీ ఆప‌రేట‌ర్ సంజ‌య్ జైన్‌, అత‌ని ల‌బ్ధిదారుల ఇళ్లల్లో నిన్న‌టి నుండి ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ-ఎన్ ‌సీఆర్‌తో పాటు ఉత్త‌రాఖండ్‌, హ‌ర్యానా, పంజాబ్‌, గోవా రాష్ట్రాల్లో ఉన్న ఇల్లులు , కార్యాల‌యాల్లో ఐటీ దాడులు జ‌రుగుతున్నాయి. ఈ సోదాల్లో ఇప్పటివరకు ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు రూ. 62 కోట్ల రూపాయలని సీజ్ చేశారు. మొత్తంగా 42 ప్రాంతాల్లో ఐటీ శాఖ సోదాలు చేస్తోంది. ఈ సోదాల్లో 2.89 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇంకా ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది. న‌కిలీ బిల్లుల ద్వారా ఎంట్రీ ఆప‌రేష‌న్ నిర్వ‌హిస్తున్న రాకెట్ ‌ను ఐటీ శాఖ అధికారులు 2020, అక్టోబర్ 27వ తేదీ మంగళవారం చేధించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే సీబీడీటీ అధికారులు ప‌లు రాష్ట్రాల్లోని 42 ప్రాంతాల్లో సోదాలు చేశారు. సుమారు 500 కోట్ల విలువైన ఎంట్రీ డాక్యుమెంట్ల‌ను కూడా సీజ్ చేశారు. 17 బ్యాంకు లాక‌ర్ల నుంచి కోట్ల విలువైన న‌గుదు, బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.




Tags:    

Similar News