విన్నంతనే షాక్ కొట్టినట్లుగా అనిపించే ఒక ఆసక్తికర నిర్ణయాన్ని ఏపీ సర్కారు తీసుకుంది. కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని అందరికంటే ముందే చెప్పేసిన జగన్మోహన్ రెడ్డి సర్కారు తీరు ఆసక్తికరమని చెప్పాలి. విద్యా సంవత్సరానికి సంబంధించి భారీ ఎత్తున ప్లానింగ్ చేస్తున్న ఏపీ సర్కారు అందులో భాగంగా.. అందరికి సమాన అవకాశాలు ఇచ్చేందుకు వీలుగా వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఏపీలో జరగాల్సిన ఎంసెట్ కు సంబంధించి రాష్ట్ర సర్కారు పలు నిర్ణయాల్ని వెల్లడించింది. అందులో ముఖ్యమైనది.. కరోనా పేషెంట్లు సైతం పరీక్షలు రాసేలా నిర్ణయం తీసుకున్నారు. వారం పాటు జరిగే ఈ పోటీ పరీక్షను వారం పాటు నిర్వహిస్తారు. ఆ వారంలో ఏదో ఒక రోజు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న విద్యార్థులు సైతం హాజరు కావొచ్చు. వీరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పరీక్షా కేంద్రాల్లో ఐదు శాతాన్ని కేటాయిస్తారు.
అంతేకాదు.. ఈ పరీక్ష రాసే హాల్లో విధులు నిర్వహించే ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లు ధరించి పని చేయాల్సి ఉంటుంది. ఎంసెట్ పరీక్షా షెడ్యూల్ ను చూస్తే.. వారం పాటు పరీక్షల్ని.. పొద్దున, సాయంత్రం వేర్వేరుగా నిర్వహిస్తారు.ఇంజినీరింగ్ ను తొమ్మిది సెషన్స్ లో నిర్వహిస్తారు. ఏపీలో నిర్వహించే వివిధ సెట్లకు సంబంధించి ఏపీ సర్కారు స్పష్టమైన నిర్ణయాల్ని తీసుకున్నారు. సెప్టెంబరు 10 నుంచి ఐసెట్ తో మొదలయ్యే సెట్ల పరంపర అక్టోబరు 5న జరిగే పీఈసెట్ తో ముగియనుంది. మొత్తం ఏడు సెట్ల (ఐసెట్, ఈసెట్, ఎంసెట్, పీజీఈసెట్, ఎడ్ సెట్, లా సెట్, పీఈసెట్)ను ఏపీ నిర్వహించనుంది.
పోటీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వచ్చినంతనే థర్మల్ స్క్రానింగ్ చేస్తారు. పరీక్ష హాళ్లను ప్రతి రోజూ శానిటైజ్ చేస్తారు. ఇన్విజిలేటర్లకు మాస్కులు.. గ్లౌజ్ లు అందజేస్తారు. బాత్రూంల వద్ద సబ్బులు.. శానిటైజర్లను అందుబాటులో ఉంచుతారు. ఇక.. కరోనా బారిన పడిన వారికి.. రెడ్ జెన్లలో ఉండే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు హాజరయ్యేందుకు వీలుగా అధికారులు వాహనాల్ని సమకూర్చనున్నారు.