లోక్ సభ నియోజకవర్గాల ప్రాతిపదికన ఏపీలోని జిల్లాల్ని మార్చాలన్న ఏపీ సర్కారు ఆలోచనకు తగ్గట్లే.. తాజాగా ఉన్నత స్థాయి కమిటీ కొత్త జిల్లాలకు సంబంధించిన కీలక ప్రతిపాదనలు చేసింది. మొత్తం 26జిల్లాల ఏర్పాటుతో పాటు మొత్తం 57 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు వీలుగా ప్రతిపాదనలుచేసింది. అరకు లోక్ సభ నియోజకవర్గంలోని పాడేరు.. పార్వతీపురం కేంద్రంగా రెండుకొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రస్తుతం ఏపీలో ఉన్న 13 జిల్లాల స్థానే.. 26 జిల్లాలు చేయాలన్నది ఆలోచన.
జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 38రెవెన్యూ డివిజన్లలో మార్పులు చేర్పులు చేయాలని ప్రభుత్వానికి సూచన చేయటంతో పాటు.. కొత్తగా 9 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తున్నారు. మూడింటిని రద్దు కోసం ప్రతిపాదిస్తున్నారు. ప్రతి జిల్లాలో రెండు.. మూడు డివిజన్లను ప్రతిపాదించారు. బాపట్ల జిల్లాలో బాపట్ల.. చీరాల రెవెన్యూ డివిజన్లకు ప్రతిపాదన చేశారు.
కొత్త జిల్లాలకు అనుగుణంగా కొత్త పోలీసు జిల్లాల హద్దులపై ఆ శాఖ ఫోకస్ చేసింది. కొత్త జిల్లాల ప్రతిపాదనకు అనుగుణంగా.. కొత్త రెవెన్యూ డివిజన్లను సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్లు పలు కీలక శాఖల్ని పునర్ వ్యవస్థీకరించనున్నారు. తెలంగాణలో అదిలాబాబ్ జిల్లా ఏర్పాటుకు అనుసరిస్తున్న విధానాల్ని కొత్త జిల్లాల ఏర్పాటులో చేయనున్నారు.
మొత్తంగా కొత్త జిల్లాలు.. పెరగనున్న రెవెన్యూ డివిజన్లకు సంబంధించిన కొత్త ప్రతిపాదనను చూస్తే.. ఇప్పుడు ఉన్న జిల్లాలు 13 కాస్తా ప్రతిపాదనలో భాగంగా 26 కానున్నాయి. ఇక.. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా రెవెన్యూ డివిజన్లు ప్రస్తుతం 51 ఉన్నాయి. తాజాగా ప్రతిపాదిత రెవెన్యూ డివిజన్లు 57. వీటిల్లో ఎలాంటి మార్పులు లేనివి పది.
అవేమంటే.. పాడేరు.. నర్సీపట్నం.. రంపచోడవరం.. నరసరావుపేట.. గురజాల.. మార్కాపురం.. ధర్మవరం.. పెనుకొండ.. కల్యాణదుర్గం.. కదిరి.
కొత్త జిల్లాల నేపథ్యంలో మార్పులు జరిగే రెవెన్యూ డివిజన్లు 38. ఇక.. కొత్తగా ఏర్పాటయ్యే 9 రెవెన్యూ డివిజన్ల విషయానికి వస్తే.. బొబ్బిలి.. భీమిలి.. తణుకు.. నందిగామ..చీరాల.. ఆత్మకూరు.. బాపట్ల.. పలమనేరు.. రాయచోటి ఉండనున్నాయి.
ఇక.. రద్దు కానున్న రెవెన్యూ డివిజన్లను చూస్తే.. నెల్లూరు జిల్లాలో ఉన్న ఆత్మకూరు.. ఎటపాక.. కుకునూరుగా ప్రతిపాదించారు. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల విషయానికి వస్తే అరకు అ జిల్లాకు పార్వతీపురం.. అరకు 2 జిల్లాకు పాడేరు.. హిందూపురం జిల్లాకు హిందుపురం లేదంటే పెనుకొండను జిల్లా కేంద్రాలుగా ప్రతిపాదించారు. అదే సమయంలో అరకు లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని 7 నియోజకవర్గాలను విభజించి.. రెండు జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదన చేశారు.
అరకు 1 పరిధిలోకి పాలకొండ.. కురుపాం.. పార్వతీపురం.. సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్ని తీసుకురావాలని ప్రతిపాదన చేశారు.అదే సమయంలో అరకు 2 పరిధిలోకి అరకు వ్యాలీ.. పాడేరు.. రంపచోడవరం నియోజకవర్గాల్ని తీసుకురావాలని సూచన చేశారు.