వైఎస్ఆర్ ప్రభుత్వం కంటే రెండడుగులు వెనక్కిపోతున్న జగన్ ప్రభుత్వం?

Update: 2020-09-07 17:00 GMT
ప్రతీ ప్రభుత్వానికి ఒక ల్యాండ్ మార్క్ ఉంటుంది. ఉదాహరణకు ఎన్టీఆర్ రెండు రూపాయలకు బియ్యం అంటూ ప్రజల్లో చెరగని ముద్రవేశారు. చంద్రబాబు ఐటీ మీద దృష్టి సారించి పాపులర్ అయ్యాడు. వైఎస్ఆర్.. రైతులు, ప్రజల సంక్షేమంలో రారాజుగా నిలిచాడు. ముఖ్యంగా వైఎస్ హయాంలో ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ, 104, 108 ఇలా ప్రజలకు నేరుగా ఉపయోగపడే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి తెలుగు ప్రజల్లో ఇప్పటికీ నిలిచిపోయారు.

అలా వైఎస్ జగన్ ల్యాండ్ మార్క్ ‘నవరత్నాలు’ అని అందరూ చెప్పుకుంటూ పోతున్నారు కానీ.. వైఎస్ జగన్ ఒక మంచి ప్రభుత్వం ఇవ్వాలంటే అతడి చుట్టుపక్కన ఉన్న సలహాదారులు ఎందుకో ప్రజలకు నేరుగా నగదు బదిలీ పథకాలు పెడదాం అని.. అవి ఓట్ల వర్షం కురిపిస్తాయని తప్పుదోవ పట్టిస్తున్నారని మేధావులు అంటున్నారు.

చంద్రబాబు నగదు బదిలీ పథకం కింద ఎన్నికలకు ముందు ప్రభుత్వం డబ్బులతో పసుపు కుంకుమ కింద ప్రతీ గ్రూప్ కి లక్ష అంటే ప్రతీ మహిళకు 10వేల రూపాయలు ఇచ్చాడు. అది పనిచేయలేదు అని జగన్ కు కొందరు గుర్తు చేస్తున్నారు. 90శాతం డ్వాక్వా మహిళలు ఉన్న ఏపీలో ప్రతీ ఒక్కరికి పదివేలు అందాయని.. అయితే ఓట్లు దాని వల్ల 2 శాతం కూడా చంద్రబాబు పడలేదని టీడీపీ వాళ్లు చెప్తున్నారు.

అలాగే వైఎస్ జగన్ ప్రతీసారి చెప్తూ ఉన్నాడు. నాన్న వైఎస్ఆర్ కంటే రెండు అడుగులు ముందు వేసి ప్రజా పాలన చేస్తానని చెప్తున్నాడు. కానీ జగన్ ఒక ఆలోచన చేయాలని పలువురు సూచిస్తున్నారు. వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్ మెంట్ వల్ల పేద వర్గాల పిల్లలు చదువుకొని బాగుపడ్డారు. వాళ్లంతట వాళ్లే కుటుంబాలు నిలబడే పథకం అది. దాని వల్ల ఎన్నో కుటుంబాలు పెద్ద పెద్ద పోజిషన్స్ లో ఉన్నారు. అది నగదు బదిలీ పథకం కాదు..

108 సర్వీసులు అంటే ఎమర్జెన్సీ సర్వీసులు. గ్రామీణ ప్రాంతాల్లో ఏమైనా మెడికల్ ఎమెర్జెన్సీ వస్తే తక్షణమే వాళ్లను బతికించే కార్యక్రమం. ఇది కూడా నగదు బదిలీ పథకం కాదు.. ఇక ఆరోగ్యశ్రీ పథకం తో పేద వర్గాలు లాభపడ్డాయి. పెద్ద ఆపరేషన్లు చేపించుకోవాలంటే లక్షలు ఖర్చు చేసుకోవాలి.. అది కుదరదు కాబట్టి వాళ్లను బతికిస్తే ఆ కుటుంబం బాగుపడుతుందని పెట్టిన ప్రోగ్రాం.

ఇలాంటివి వైఎస్ఆర్ ఆ రోజు చేశారు కాబట్టి తర్వాతర్వాత వైఎస్ఆర్ పేరు మారుమోగిపోయింది. అలాగే ఎన్టీఆర్ పేరు కూడా ప్రజల్లో నిలబడింది. ఎన్టీఆర్ కానీ.. వైఎస్ఆర్ కానీ నీటిపారుదల ప్రాజెక్టులు, లోన్లు, మంచి పథకాలు ప్రవేశపెట్టారు. రైతుల బాగుంటే రాష్ట్రం బాగుంటుందని వాళ్లు సాగునీటి ప్రాజెక్టులు మొదలు పెట్టి దాదాపు బడ్జెట్ ప్రకారం పూర్తి చేశారు. అవి పూర్తి అయితే ఎవరి మీద ఆధారపడకుండా రైతులు బాగుపడుతారని వాళ్లకు గిట్టుబాటు ధర అందితే వాళ్లందరూ లక్షాధికారులు అవుతారని వైఎస్ఆర్, ఎన్టీఆర్ ఇద్దరు నాయకులు ఆలోచన చేశారు.

నగదు బదిలీ పథకాల వల్ల వాళ్ల బతుకులు బాగుపడుతాయి అని అనుకుంటే పొరబాటే అని మేధావులు అంటున్నారు. చంద్రబాబు నగదు బదిలీ పథకాలు పెట్టి ఫెయిల్ అయితే.. ఇప్పటి వైఎస్ జగన్ నగదు బదిలీ పథకాలు 100శాతం పెంచి రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెటుతున్నాడు తప్పితే రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ.. అభివృద్ధిలోకి కానీ తీసుకెళ్లడం లేదని విశ్లేషకులు అంటున్నారు.

15 నెలల్లో లక్ష కోట్లు అప్పు చేస్తే.. 50వేల కోట్లు నగదు బదిలీ పథకాలకు ఇచ్చారు. ఏమీ లాభం ఏమైనా అభివృద్ధి అయ్యిందా? ప్రభుత్వానికి పేరు వచ్చిందా? ప్రజలు తీసుకున్నారు.. సైలెంట్ గా ఉన్నారని విశ్లేషకులు చెప్తున్నారు.

ఉదాహరణకు అమ్మ ఒడి పథకం కింద ఇస్తే ఇంట్లో మగవాళ్లు మద్యం తెచ్చుకొని తాగి తందనాలు ఆడుతున్నారు తప్పితే ఏమీ ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇలా వైఎస్ఆర్ కల అయిన రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే రైతులు అందరూ బాగుపడ్డారు. అందుకే రైతులందరూ వైఎస్ఆర్ ను దేవుడు అంటారు. అంతకంటే మంచి చేస్తాడని ఆయన తనయుడు జగన్ ను రైతులు నమ్మారు. కానీ బీజేపీకి తలొగ్గి విద్యుత్ మీటర్లు బిగిస్తే రైతులు ఏం కావాలి? డిస్కంలకు రైతులు చెల్లిస్తారా? ఇప్పటి బడ్జెట్ ప్రకారం డిస్కంలకి బకాయిలు చెల్లించలేని పరిస్థితి. కానీ రైతులకు నేరుగా ఇలా ఇస్తాం. వాళ్లే కట్టుకుంటే చాలు అంటారు. పెండింగ్ బకాయిలతో మీటర్లు డిస్ కనెక్షన్ చేస్తే ఏంటి పరిస్థితి. అప్పుడు ఇబ్బంది పడేది రైతులు కదా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు..

అందుకే తెలంగాణలో కేసీఆర్ ఈ విధానానికి ఒప్పుకోవడం లేదు. ఏపీ ఎందుకు ఒప్పుకోవాలని మేధావులు అంటున్నారు. ప్రజలు బాగు పడే కార్యక్రమాలు చేయాలని.. నగదు బదిలీ పథకాలు ఆపి సర్వీసులు, జాబులు సృష్టించే పరిశ్రమలు వచ్చే పనులు చేయాలని కోరుకుంటున్నారు.
Tags:    

Similar News